E-Paper
Advertisement

TSPSC: 100 కోట్లు కడతారా? సారీ చెబుతారా?.. కేటీఆర్ లీగల్ నోటీస్

TSPSC: 100 కోట్లు కడతారా? సారీ చెబుతారా?.. కేటీఆర్ లీగల్ నోటీస్
Advertisement
ktr revanth bandi

TSPSC: మంత్రి కేటీఆర్ అన్నంత పని చేశారు. రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌లపై పరువునష్టం దావా వేసేందుకు సిద్ధమయ్యారు. రూపాయ్, రెండు రూపాయలు కాదు.. ఏకంగా 100 కోట్లకు లీగల్ సూట్ ఫైల్ చేయబోతున్నారు. TSPSC కేసులో తనపై చేస్తున్న ఆరోపణలు ఆపకపోతే లీగల్ నోటీసులు ఇస్తానని ఇటీవలే హెచ్చరించారు. అయినా, వారు లైట్ తీసుకున్నారు. ఆరోపణలు కంటిన్యూ చేశారు. మేటర్‌ను కేటీఆర్ సీరియస్‌గా తీసుకున్నారు. చెప్పినట్టుగానే పీసీసీ చీఫ్‌, బీజేపీ చీఫ్‌లపై 100 కోట్లకు పరువునష్టం దావా వేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది.

TSPSC పేపర్ లీక్ ఘటన వెలుగుచూసినప్పటి నుంచీ మంత్రి కేటీఆర్ టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారు ఆ ఇద్దరు. కేటీఆర్ పీఏ తిరుపతి హస్తం ఉందని.. కేటీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వాలంటూ రేవంత్‌రెడ్డి పదే పదే ఊదరగొడుతున్నారు. బండి సంజయ్ సైతం కేటీఆరే పరీక్ష పేపర్లు అమ్ముకున్నారనేలా ఆరోపణలు చేస్తున్నారు.

Advertisement

విపక్ష నేతలిద్దరు కలిసి.. ఒకే మాట పలుమార్లు చెబుతుండటంతో.. కేటీఆర్ ఉలిక్కిపడుతున్నారు. నిజమే కావొచ్చు, పేపర్ లీకేజీకి కేటీఆర్‌కు సంబంధం ఉంది కావొచ్చు..అని జనం అనుకునే ప్రమాదం ఉందని కేటీఆర్ భయపడినట్టున్నారు. వెంటనే వారి ఆరోపణలకు చెక్ పెట్టేందుకు.. పొలిటికల్‌గా కాకుండా లీగల్‌గా ఫైట్ మొదలుపెట్టారు.

రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌లకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. TSPSC కేసులో తనపై నిరాధార ఆరోపణలు చేశారని అన్నారు. రాజకీయ దురుద్దేశంతో తనపై చేసిన ఆరోపణలను.. వారంలోగా వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణలు చెప్పాలని నోటీసులో డిమాండ్ చేశారు. లేదంటే, 100 కోట్ల పరువునష్టం దావా ఎదుర్కునేందుకు సిద్ధమవ్వాలని హెచ్చరించారు. మరి, కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులకు వారిద్దరు ఎలా రియాక్ట్ అవుతారో..?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×