E-Paper
Advertisement

KTR: మా రక్తం ఎంత కావాలంటే అంత పంపిస్తాం.. కానీ ఆ పని చెయ్: కేటీఆర్!

KTR: మా రక్తం ఎంత కావాలంటే అంత పంపిస్తాం.. కానీ ఆ పని చెయ్: కేటీఆర్!
Advertisement

KTR: స్వేచ్ఛ బ్యూరో: ఇంకా మీ రక్తదాహం తీరలేదా? అని కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. 60 ఏండ్లు పీడించి తెలంగాణ నెత్తురు తాగారు కదా సరిపోలేదా? అని నిలదీశారు. ఎక్స్ వేదికగా ఆదివారం పైర్ అయ్యారు. తెలంగాణ రక్తం రుచిమరిగిన తోడేలు కాంగ్రెస్ పార్టీకి ఇంకెంత రక్తం కావాలి? అని ప్రశ్నించారు.

ఎన్ కౌంటర్ల పేరుతో..

తెలంగాణ పిల్లల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపారేసి ఎన్ కౌంటర్ల పేరుతో నెత్తుటేళ్లు పారించిన నరహంతకులు మీరు.. 1952లో ఏడుగురు యువకులను కాల్చిచంపి రక్తం కళ్లజూసిన రాక్షసులు మీరు అని మండిపడ్డారు. 1969లో 369 మంది ముద్దుబిడ్డలపై తూటాలు కురిపించి రక్తం పారించిన ఖూనీకోర్లు మీరు!, మలిదశ పోరాటంలో వేయిమందిని బలితీసుకున్న మృగాలు మీరు అని ధ్వజమెత్తారు.

Advertisement

Also read: ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. మంచినీళ్లు అనుకుని యాసిడ్ తాగిన యువతి!

రైతులకు నీళ్లు ఇవ్వు!

కాంగ్రెస్ పార్టీ చేతులు తెలంగాణ బిడ్డల రక్తంతో తడిచినై..!కాంగ్రెస్ రక్కసి కోరలకు తెలంగాణ నెత్తుటి మరకలు అంటినై..!నీకు మా రక్తం ఎంత కావాలంటే అంత పంపిస్తాం..కానీ, నువ్వు రైతులకు నీళ్లు ఇవ్వు! అని కోరారు. పేగులు తెగేదాకా రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్లం.. రైతుల కోసం ఎంత రక్తమైనా ధారపోయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. నీళ్లలో నిప్పులు పుట్టించి జలసాధన పోరాటాలు చేసిన వాళ్లం..! నెత్తురు ఇస్తేనే..నీళ్లు ఇస్తాం అని కర్కశ కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతుంటే మా నెత్తురు ధారపోస్తాం! అని స్పష్టం చేశారు. మీ రక్తదాహం తీర్చుకోని.. ఎండుతున్న పొలాల జలదాహం తీర్చండి అని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Also read: Road Development: నల్గొండ జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్.. రికార్డు స్థాయిలో నిధులు విడుదల!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×