E-Paper
Advertisement

Koti SBI ATM Robbery: పగడ్బందీగా స్కెచ్.. కోఠి ఏటీఎం కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు

Koti SBI ATM Robbery: పగడ్బందీగా స్కెచ్.. కోఠి ఏటీఎం కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు
Advertisement

Koti SBI ATM Robbery: హైదరాబాద్‌లోని కోఠి బ్యాంక్ ఏటీఎం నగదు చోరీ కేసుపై సీపీ సజ్జనార్ అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళలోని కోజికోడ్‌కు చెందిన రిన్షాద్ అనే వ్యక్తి హోల్‌సేల్ స్టాక్ కొనుగోలు నిమిత్తం ₹6 లక్షల నగదుతో జనవరి 7న నగరానికి చేరుకున్నారు. ఈరోజు ఉదయం సుమారు 7 గంటల సమయంలో ఆ నగదును బ్యాంకులో జమ చేసేందుకు ఆయన కోఠిలోని ఎస్‌బీఐ (SBI) ఏటీఎం సెంటర్‌కు వెళ్లారు.

అదే సమయంలో అక్కడ పొంచి ఉన్న ఇద్దరు గుర్తుతెలియని దుండగులు తుపాకీతో రిన్షాద్‌ను బెదిరించారు. ప్రతిఘటించే ప్రయత్నం చేయగా.. దుండగులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రిన్షాద్ కుడి కాలికి గాయమైంది. వెంటనే నిందితులు ఆయన వద్ద ఉన్న నగదు సంచిని, వాహన తాళాలను లాక్కొని.. బాధితుడి వాహనంలోనే అక్కడి నుండి పరారయ్యారు. నిందితులు చాదర్‌ఘాట్ మీదుగా కాచిగూడ వైపు వెళ్లినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అయితే పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు నిందితులు కొంత దూరం వెళ్ళాక వాహనాన్ని వదిలేసి, తమ దుస్తులు మార్చుకుని కాలినడకన పారిపోయినట్లు సమాచారం.

Advertisement

బాధితుడి ఫిర్యాదు మేరకు సుల్తాన్‌బజార్ పోలీసులు పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక క్రైమ్ టీమ్స్‌ను రంగంలోకి దింపారు. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీలు, టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై ఏవైనా ఆధారాలు లేదా సమాచారం తెలిసిన వారు వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని నగర పోలీసులు స్పష్టం చేశారు.

Also Read: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో డ్రగ్స్ కలకలం.. రూ. 9.5 కోట్ల హైడ్రోపోనిక్ గంజాయి సీజ్!

Advertisement

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×