E-Paper
Advertisement

Venkatesh Remuneration: వరుస హిట్లు.. రెమ్యూనరేషన్ డబుల్ చేసిన వెంకీ మామ.. ఎంతంటే?

Venkatesh Remuneration: వరుస హిట్లు.. రెమ్యూనరేషన్ డబుల్ చేసిన వెంకీ మామ.. ఎంతంటే?
Advertisement

Venkatesh remuneration: టాలీవుడ్ సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇటీవల వెంకటేష్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ హిట్ అవడంతో వెంకీ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే అనిల్ రావిపూడితో మరో సినిమా కూడా చేయబోతున్నారని తెలుస్తుంది.

రెమ్యూనరేషన్ డబుల్ చేసిన వెంకీ..

గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న వెంకటేష్ తన రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచారని తెలుస్తుంది. ఈ సినిమా కోసం పది కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్న ఈయన ఇప్పుడు తన రెమ్యూనరేషన్ డబల్ చేస్తూ 20 కోట్లకు పెంచారని తెలుస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) డైరెక్షన్లో చేయబోతున్న ఆదర్శ కుటుంబం సినిమాకు 20 కోట్లు అందుకుంటున్నట్లు సమాచారం. ఆదర్శ కుటుంబం శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. 2026 సమ్మర్ కి ఈ సినిమాని విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు సమాచారం.

2026 సమ్మర్ లో ఆదర్శ కుటుంబం..

Advertisement

ఇప్పటివరకు వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఒక సినిమా కూడా రాలేదు కానీ త్రివిక్రమ్ కథా రచయితగా పనిచేసిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి సినిమాలలో వెంకటేష్ నటించిన మంచి సక్సెస్ అందుకున్నారు. మొదటిసారి త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఈయన సినిమా చేయబోతుండడంతో ఈ సినిమా పట్ల కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గానే ఉండబోతుందని స్పష్టం అవుతుంది. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా సందడి చేయబోతున్నారు.
ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ లో విడుదల అయితే అనంతరం వెంకటేష్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో మరో సినిమా పనులలో బిజీ కానున్నారు.

వెంకటేష్ జోడిగా పూజ హెగ్డే..

Advertisement

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ నటించి ఈ సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి. వీరిద్దరి కాంబినేషన్ లో ఈ సినిమా 4 వ సినిమా కావటం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని, మరొక 15 రోజులలో ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన రాబోతున్నట్లు అనిల్ రావిపూడి తెలియజేశారు. ఇక ఈ సినిమాలో వెంకటేష్ కి జోడిగా పూజ హెగ్డే నటించబోతున్న నేపథ్యంలో వెంకటేష్ అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. ఇక ఈ సినిమాని అనిల్ రావిపూడి 2027 సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఇలా ప్రతి ఏడాది సంక్రాంతి పండుగను టార్గెట్ చేస్తూ అనిల్ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను అందుకోబోతున్నారు.

Also Read: Anil Ravipudi: వెంకీకి జోడిగా డిజాస్టర్ బ్యూటీ… సాహసం చేస్తున్న అనిల్ రావిపూడి!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×