E-Paper
Advertisement

Khammam Rice Mills: డిఫాల్ట్ రైస్ మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు : అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి

Khammam Rice Mills: డిఫాల్ట్ రైస్ మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు : అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి
Advertisement

Khammam Rice Mills: ఖమ్మం,స్వేచ్ఛ బ్యూరో: ధాన్యం నిధుల పరిరక్షణలో రాజీ పడబోమని,ప్రభుత్వానికి డిఫాల్ట్ చేసే మిల్లర్ల పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకున్నట్లు అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తెలిపారు. మిల్లర్ల నుంచి బకాయి వసూలు చర్యలు వేగవంతం చేయడంతో పాటు సంబంధిత శాఖల ద్వారా తదుపరి విచారణ కొనసాగుతున్నదని అదనపు కలెక్టర్ తెలిపారు. ఖమ్మం రూరల్ మండలం మంగలగూడెం గ్రామంలోని శ్రీ సత్యనారాయణ సిల్కీ సార్టెక్స్ రైస్ మిల్ యాజమాన్యం 2021–22 ఖరీఫ్, 2022–23 ఖరీఫ్, రబీ, 2023–24 ఖరీఫ్ సీజన్లలో ప్రభుత్వానికి బియ్యం అందజేయడంలో విఫలమై రూ. 9.49 కోట్లు అసలు బకాయి పడగా, పెనాల్టీలతో కలిపి రూ.13.84 కోట్లుడిఫాల్ట్ చేసినట్లు తెలిపారు. ఈ మిల్లు మేనేజింగ్ భాగస్వామి కన్నేటి జ్యోతి, భాగస్వామి మామిడాల మానసపై ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్.ఐ.ఆర్. నెం. 129/2026 నమోదైందన్నారు.

Also Read: Mahanadi Coalfields: మైనింగ్ రంగంలో ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ.51వేల జీతం, విద్యార్హతలు ఇవే..

రూ. 7.59 కోట్లు అసలు బకాయి

Advertisement

నేలకొండపల్లి మండలం రాయిగూడెం గ్రామంలోని వెంకటేశ్వర రైస్ మిల్ 2022 – 23 ఖరీఫ్, రబీ సీజన్లలో రూ. 7.59 కోట్లు అసలు బకాయి కాగా, పెనాల్టీలతో కలిపి రూ.10.88 కోట్లు డిఫాల్ట్ చేసినట్లు తెలిపారు. ఈ మిల్లు యజమాని మేకల రామారావుపై నేలకొండపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్.ఐ.ఆర్. నెం. 47/2026 నమోదైందన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్ (సి.ఎం.ఆర్)లో ఒప్పంద నిబంధనలు ఉల్లంఘించి, ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకుండా డిఫాల్ట్ చేసిన రైస్ మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Also Read: Shivani Nagaram: తిరుమల శ్రీవారి 15 నిమిషాల దర్శనంపై శివానీ ఇచ్చిన క్లారిటీ ఇదే!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×