E-Paper
Advertisement

Dacoit: ‘రుబరూ’ సాంగ్ ప్రోమో.. మృణాల్‌ని చూస్తే మతిపోతోంది!

Dacoit: ‘రుబరూ’ సాంగ్ ప్రోమో.. మృణాల్‌ని చూస్తే మతిపోతోంది!
Advertisement

Dacoit: అడివి శేష్ (Adivi Sesh), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కాంబోలో రూపుదిద్దుకుంటోన్న హై వోల్టేజ్ యాక్షన్ చిత్రం ‘డెకాయిట్’ (Dacoit). ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు హై వోల్టేజ్ యాక్షన్‌‌ని పరిచయం చేసి అలరించిన మేకర్స్‌, ఇప్పుడు హార్ట్‌ఫెల్ట్ రొమాన్స్‌తో సినిమా మ్యూజికల్ జర్నీని స్టార్ట్ చేశారు. ఈ తెలుగు-హిందీ ద్విభాషా చిత్రంతో షానియల్ డియో (Shaniel Deo) దర్శకుడిగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వచ్చిన టీజర్, గ్లింప్స్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ అయ్యేలా చేసిన మేకర్స్.. మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా ఫస్ట్ సింగిల్ ‘రుబరూ’ని ఫిబ్రవరి 27న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ సాంగ్ ప్రోమో (Rubaroo Song Promo)ని మేకర్స్ వదిలారు. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరీ ముఖ్యంగా ఇందులోని మృణాల్ లుక్‌కు అంతా ఫిదా అవుతున్నారు.

Also Read- Shivani Nagaram: తిరుమల శ్రీవారి 15 నిమిషాల దర్శనంపై శివానీ ఇచ్చిన క్లారిటీ ఇదే!

‘సీతా రామం’ సీత గుర్తొస్తోంది

Advertisement

‘రుబరూ’ సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌‌లో శేష్ ప్రశాంతమైన ఇంటెన్స్ లుక్‌లో ఉండగా, మృణాల్ సున్నితమైన నవ్వుతో కనిపించింది. ఇక తాజాగా వచ్చిన ప్రోమోని గమనిస్తే.. ‘జూలియట్.. నువ్వు ఉంటావు కదా’ అని అడివి శేష్ అడుగుతుంటే.. మృణాల్ ఠాకూర్ చూసిన చూపు.. ఒక్కసారిగా ‘సీతా రామం’ చిత్రాన్ని గుర్తుకు తీసుకొస్తోంది. ‘నేను’ అని అడివి శేష్ ఫేస్‌ని పట్టుకుని మృణాల్ చెబుతుంటే.. ఆమె గ్లామర్‌కి, లుక్‌కి మతిపోతుందంటే అతిశయోక్తి కానే కాదు. అంత నేచురల్‌గా మృణాల్ ఇందులో కనిపిస్తోంది. ఆమె అలా చెప్పగానే జైలులో అడివి శేష్‌ని చూపించారు. ఓ పోలీస్ ఆఫీసర్ జైల్ ఊసలపై లాఠీతో టపా టపా కొట్టడం చూస్తుంటే.. ఇది ఒక మాంటేజ్ సాంగ్ అనే భావన కలుగుతోంది. ఈ పాట ప్రోమో కూడా సినిమా స్టోరీ ఏంటనే క్యూరియాసిటీని కలిగిస్తుందంటే.. ‘డెకాయిట్’లో ఉన్న మ్యాటరేంటో అర్థం చేసుకోవచ్చు.

Also Read- Star Actor: పాకెట్ మనీ కావాలంటే భార్యను అడగాల్సిందే.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్!

కెమిస్ట్రీ అదిరింది

Advertisement

కచ్చితంగా ‘రుబరూ’ సాంగ్ చార్ట్ బస్టర్ అవుతుందనే ఫీల్‌ని ఈ ప్రోమో ఇస్తోంది. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ మాత్రం వావ్ అనే రేంజ్‌లో వర్కవుట్ అయినట్లుగా మృణాల్ చూపులు తెలియజేస్తున్నాయి. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్న ఈ పాట ఫుల్ సాంగ్ కోసం అంతా ఎంతగానో వేచి చూస్తున్నారు. అలా వేచి చూసే వారంతా ఫుల్ సాంగ్ కోసం ఫిబ్రవరి 27 వరకు ఓపిక పట్టాల్సిందే. సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాలో అడివి శేష్‌, మృణాల్ ఠాకూర్‌తో పాటు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తెలుగు, హిందీలో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్-ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Also Read- Faria Abdullah : అందాలతో పిచ్చెక్కిస్తున్న చిట్టి.. పిల్లలు కళ్లు మూసుకోండమ్మా..!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×