E-Paper
Advertisement

Kavitha: కాంగ్రెస్ హామీలు నెరవేర్చేందుకు.. బీసీలకు 20వేలకోట్లు కేటాయించాలి : కవిత డిమాండ్!

Kavitha: కాంగ్రెస్ హామీలు నెరవేర్చేందుకు.. బీసీలకు 20వేలకోట్లు కేటాయించాలి : కవిత డిమాండ్!
Advertisement

Kavitha: ఓవైసీ బ్రదర్స్ పొద్దు తిరుగుడు పువ్వులు అధికారం ఎక్కడుంటే వాళ్లు అటు ఉంటారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో  మీడియాతో మాట్లాడారు. ఓవైసీ బ్రదర్స్ అధికారం చుట్టూ తిరిగే సన్ ప్లవర్స్ అని అన్నారు. గతంలో రాయల తెలంగాణ అని తెలంగాణను వ్యతిరేకించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ తెలంగాణ వచ్చాక కేసీఆర్ తో కలిసి అధికారంలో భాగస్వాములు అయ్యారన్నారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ తో జత కట్టారు. రాహుల్ గాంధీ కేంద్రంలో ఓవైసీ బ్రదర్స్ ను వ్యతిరేకిస్తారన్నారు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి మాత్రం వారితో దోస్తానా చేస్తారన్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కోసం ఓవైసీ బ్రదర్స్ అభ్యర్థినే పెట్టలేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక రంజాన్ తోఫా ఇవ్వలేదు. ముస్లింల కోసం రంజాన్ తోఫా ఇప్పించాలని ఓవైసీని డిమాండ్ చేశారు. ఓల్డ్ సిటీలో అసలు అభివృద్ధి లేదు. ఓవైసీ సోదరులు ఓల్డ్ సిటీలో ఎందుకు ఉండటం లేదు? అని ప్రశ్నించారు. బడ్జెట్ లో మైనార్టీలకు కాంగ్రెస్ కేటాయించిన నిధులను ఖర్చు చేయలేదని ఆరోపించారు.

రూ.20 వేల కోట్లు కేటాయించాలి

కాంగ్రెస్ హామీలు నెరవేర్చేందుకు బడ్జెట్ లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. 1.89 లక్షల ఉద్యోగాల భర్తీకి బడ్జెట్ లో ప్రొవిజన్ పెట్టాలి. జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని కోరారు. బీసీలకు బడ్జెట్ లో రూ.20 వేల కోట్లు కేటాయించాలని, బీసీ సబ్ ప్లాన్ ప్రకటించాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా సమస్యలు పక్కన పెట్టారని ఆరోపించారు. ప్రజల సమస్యల దృష్టి మరల్చి బూతులు తిట్టుకోవటాడికే ప్రచారం నిర్వహించారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ లు కలిసి సర్దుబాట్లు చేసుకున్నాయని మండిపడ్డారు. మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్రం రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే సీఎం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. లేబర్ కోడ్, ఉపాధి హామీ అంశాలపై సీఎం స్పందించాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్ కు వ్యతిరేకంగా ఈ నెల 12నజరిగే బంద్ కు జాగృతి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. అదే రోజు తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నామని భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.

Advertisement

Also Read: TG Municipal Elections 2026: గెలుపే లక్ష్యం.. ఎంతైనా ఖర్చు చేద్దాం.. మున్సిపల్ బరిలో అభ్యర్థుల భారీ ప్లాన్!

బస్తీ దవాఖానాల్లో గోలీలు లేవు, డాక్టర్లు లేరు

మహబూబ్ నగర్ లో ఇప్పటికీ రెండు రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయని, గతంలో ఎప్పుడు ఉన్నా బస్సు సర్వీసే ఇప్పుడు ఉందని పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ మీద దృష్టి పెట్టలేదన్నారు. ప్రభుత్వ స్కూళ్లను చూస్తుంటే పిల్లలు తక్కువ, పంతులు ఎక్కువ ఉన్న పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. బస్తీ దవాఖానాల్లో గోలీలు లేవు, డాక్టర్లు లేరు. వాటిపై రివ్యూ కూడా లేదు. రోడ్లపై, డ్రైనేజీ లో చెత్త గుట్టులు గుట్టలుగా పేరుకపోయిందన్నారు. ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోవటం లేదన్నారు. వ్యక్తులను తిట్టడానికే మున్సిపల్ఎన్నికలు పరిమితమయ్యాయన్నారు. సింహం గుర్తు పై పోటీ చేస్తున్న మా జాగృతి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు ఉంటే ఒక్క మున్సిపాలిటీకి మాత్రమే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వచ్చిందన్నారు.

3 లక్షల 25 వేల కోట్లుగా పెట్టే అవకాశం

Advertisement

అది స్నేహం కారణంగా సిద్దిపేట కు మాత్రమే మంజూరు చేశారన్నారు. రెవెన్యూ డిఫిసిట్ 9 వేల కోట్లు ఉంది. సంపద సృష్టి లేదు. అప్పులు మాత్రం 122 శాతం ఎక్కువగా చేశారని, ఫించన్ల కోసం గత బడ్జెట్ లో పెట్టిన లక్షా 21 వేల కోట్లలో 51 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. కమీషన్లు ఎక్కువ వచ్చే చోట డబ్బులు ఖర్చు చేశారన్నారు. కాంట్రాక్టర్లకు పెట్టుకున్న లక్ష్యం కన్నా కూడా ఎక్కువ గా ఇచ్చారని, వచ్చే బడ్జెట్ ను కచ్చితంగా 3 లక్షల 25 వేల కోట్లుగా పెట్టే అవకాశం ఉందన్నారు. యాసంగి రైతు భరోసా ఇప్పటికీ విడుదల చేయలేదని, వెంటనే వాటిని రిలీజ్ చేయాలన్నారు. రైతు రుణమాఫీ వందశాతం చేశామని సీఎం చెప్పారని, కానీ నేను ఛాలెంజ్ చేస్తున్నా.. నిజామాబాద్, మహబూబ్ నగర్, సచివాలయం ఎక్కడైనా సరే చర్చకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు. ఉపాధి హామీకి సంబంధించి రాష్ట్రాలకు 40 శాతం వాటా అంటే దాని గురించి ఆందోళన చేయలేదు.. కానీ పేరు మార్పు గురించి మాత్రమే మాట్లాడారని, సీఎం కేంద్రానికి సహకరిస్తున్నారని ఆరోపించారు.

Also Read: Pawan Kalyan: సొంత కుటుంబ సభ్యుల్లా పిఠాపురం ప్రజలు.. మరో ఇద్దరు అనాథలకు అండగా నిలిచిన జనసేనాని.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×