// // Telangana Politics: తాను చెబుతున్న దెయ్యం ఆయనే.. గూఢచారి కూడా, కవిత కామెంట్స్ -->
E-Paper
Advertisement

Telangana Politics: తాను చెబుతున్న దెయ్యం ఆయనే.. ఆపై గూఢచారి కూడా, కవిత హాట్ కామెంట్స్

Telangana Politics: తాను చెబుతున్న దెయ్యం ఆయనే.. ఆపై గూఢచారి కూడా, కవిత హాట్ కామెంట్స్
Advertisement

Telangana Politics: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో నెక్ట్స్ నోటీసులు ఎవరికి? జాగృతి చీఫ్ కవిత ఉన్నారా? రేపో మాపో ఆమెకి సిట్ నోటీసులు ఇవ్వనుందా? ఆ తర్వాత విచారణ నిమిత్తం పెద్దాయనకు నోటీసులు ఇస్తారా? దీనిపై బీఆర్ఎస్‌లో రకరకాలుగా నేతలు చర్చించుకుంటున్నారు.

సంతోష్‌రావుపై కీలక వ్యాఖ్యలు చేసిన కవిత

Advertisement

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు అనేక మలుపు తిరుగుతోంది. అందరూ ఊహించినట్టుగా కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండే మాజీ ఎంపీ సంతోష్‌ రావుకు నోటీసులు ఇచ్చింది. రేపో మాపో కవితకు నోటీసు ఇవ్వడం ఖాయమనే చర్చ జోరుగా సాగుతోంది. గత ప్రభుత్వం తన భర్త ఫోన్‌ని ట్యాప్ చేశారని ఆమె బహిరంగంగానే చెప్పారు. వీటికి సంబంధించిన వివరాలు ఇవ్వడానికి తాను సిద్ధమేనని వ్యాఖ్యానించారు.

ఈ విషయంలో ఆమె నుంచి వివరణ తీసుకుని స్టేట్‌మెంట్ రికార్డు చేసే అవకాశం ఉన్నట్లు చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్‌లో ఉండి బయటకు వచ్చిన కవిత, సిట్ విచారణలో ఎలాంటి వివరాలను వెల్లడిస్తారనేది అసలు ప్రశ్న. ఈ కేసులో ఇప్పటికే ఎమ్మెల్సీకి నోటీసులు ఇచ్చి విచారించారు. ఆ తర్వాత మాజీమంత్రలు హరీష్‌రావు, కేటీఆర్ వంతైంది. తాజాగా సంతోష్‌రావు వంతైంది.

Advertisement

తాను చెబుతున్న దెయ్యం ఆయన, గూడఛారి కూడా

బీఆర్ఎస్ నేతలను విచారణకు పిలవడంపై కవిత రియాక్ట్ అయ్యారు. ఇదే సమయంలో మాజీ ఎంపీ సంతోష్‌రావు టార్గెట్ విమర్శలు గుప్పించారు. మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడిన కవిత, కీలక వ్యాఖ్యలు చేశారు. సంతోష్‌రావు వల్ల గద్దర్ లాంటి ఉద్యమ నాయకులు ఒకప్పుడు ముఖ్యమంత్రి గేట్ బయట ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

తాను ముందు నుండి చెబుతున్న దయ్యం ఆయనేనని, మన నీడను కూడా మనం నమ్మలేమని వ్యాఖ్యానించారు. ఆయన్ని సిట్ పిలవడం వరకు ఒకే కానీ, ఎలాంటి శిక్ష విధిస్తుందో చూడాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి‌కి సంతోష్‌రావు గూఢచారిగా ఉన్నారంటూ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో గృహ హింస పెరుగుతోందని, ఎక్సైజ్ పోలీసులు అంటే గంజాయి సరఫరా వారికి, స్మగ్లర్లకు ఏ మాత్రం భయం లేదన్నారు.

ALSO READ: మేడారం జాతరలో మహాఘట్టం.. పెళ్లికొడుకుగా పగిడిద్దరాజు

ఎక్సైజ్ అధికారుల దగ్గర ఆయుధాలు ఉంటే స్మగ్లర్లకు భయం ఉంటుందని, తిరిగి ఫారెస్ట్ అధికారులకు వెపన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేరగాళ్ల విచ్చలవిడితనం పెరిగిపోయిందన్నారు. గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఉదయం ఆమెని ఆసుపత్రిలో పరామర్శించారు కవిత. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×