E-Paper
Advertisement

Kalvakuntla Kavitha: పేదలకు ఒక న్యాయం.. బడా బాబులకు ఒక న్యాయమా..? మూసీ ఒడ్డున కవిత ఆందోళన

Kalvakuntla Kavitha: పేదలకు ఒక న్యాయం.. బడా బాబులకు ఒక న్యాయమా..? మూసీ ఒడ్డున కవిత ఆందోళన
Advertisement

హైదరాబాద్ శివారు నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించి నిర్మిస్తున్న భారీ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఓ రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులు, తెలంగాణ జాగ‌ృతి కార్యకర్తలతో కలిసి ఆమె శ్రీ ఆదిత్య లగ్జరీ అపార్ట్‌మెంట్స్ వద్ద భారీ ఆందోళన చేపట్టారు. నది పరివాహక ప్రాంతాన్ని కబ్జా చేసి నిర్మిస్తున్న ఈ వెంచర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో సామాన్యుల ఇళ్లను కూల్చివేయాలని చూస్తున్న రేవంత్ సర్కార్.. ఇలాంటి బడా వెంచర్ల విషయంలో ఎందుకు మౌనంగా ఉంటుందని గట్టిగా ప్రశ్నించారు.

పేదల నివాసాలను నేలమట్టం చేసే హైడ్రాకు ఈ అక్రమ నిర్మాణాలు కనిపించడం లేదా అని కవిత నిలదీశారు. ప్రభుత్వ తీరు పక్షపాతంగా ఉందని ఆమె విమర్శించారు. ఒకవైపు సామాన్యుల గూడు చెడగొడుతూ.. మరోవైపు రియల్ ఎస్టేట్ మాఫియాకు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ జాగృతి నాయకులు స్థానికులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మూసీ సుందరీకరణ పేరుతో కేవలం పేదలనే టార్గెట్ చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

గాంధీ సరోవర్ ప్రాజెక్టు ముసుగులో జరుగుతున్న అన్యాయాలను సహించబోమని కవిత హెచ్చరించారు. నార్సింగిలో మూసీ నది సహజ ప్రవాహానికి అడ్డుగా వెలుస్తున్న శ్రీ ఆదిత్య లగ్జరీ అపార్ట్‌మెంట్స్ వెంచర్‌ను వెంటనే అడ్డుకోవాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ నిర్మాణాలను హైడ్రా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆమె దుయ్యబట్టారు. చట్టం అందరికీ సమానంగా ఉండాలని.. పేదలకో న్యాయం బడా బాబులకో న్యాయం ఉండకూడదని స్పష్టం చేశారు.

Advertisement

ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని కవిత ప్రకటించారు. మూసీ నదిని రక్షించాలన్న ఉద్దేశ్యం నిజంగా ఉంటే.. ముందుగా ఇలాంటి భారీ ఆక్రమణలపై బుల్డోజర్లను నడపాలని సవాల్ విసిరారు. సామాన్యుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఆక్రమణలకు గురైన నది భూములను తిరిగి స్వాధీనం చేసుకునే వరకు విశ్రమించబోమని వారు స్పష్టం చేశారు.

ALSO READ: CM Revanth Reddy: పలువురు కలెక్టర్ల పనితీరుపై సీఎం రేవంత్ సీరియస్.. రూల్స్ ఫాల్లో అవ్వాల్సిందే, కీలక ఆదేశాలు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×