E-Paper
Advertisement

Airtel annual plans 2026: ఎయిర్‌టెల్ చౌకైన వార్షిక ప్లాన్స్.. రోజుకు రూ.5 ఖర్చుతో.. అపరిమిత కాల్స్, 5G డేటా!

Airtel annual plans 2026: ఎయిర్‌టెల్ చౌకైన వార్షిక ప్లాన్స్.. రోజుకు రూ.5 ఖర్చుతో.. అపరిమిత కాల్స్, 5G డేటా!
Advertisement

Airtel annual plans 2026: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్ టెల్.. తన యూజర్లకు మెరుగైన సేవలను అందిస్తుంటుంది. నాణ్యమైన కాల్స్, హైస్పీడ్, 5G డేటా, ఫ్రీ ఓటీటీ కనెక్టివిటీ వంటి ఎన్నో ప్రయోజనాలను ఎయిర్ టెల్ యూజర్లు పొందుతున్నారు. అయితే ఏడాది పొడవునా సిమ్ కార్డును యాక్టివ్ గా ఉంచుకోవాలని భావించేవారికి.. రెండు చౌకైనా వార్షిక ప్లాన్స్ ను ఎయిర్ టెల్ అందిస్తోంది. అయితే చాలా మందికి ఈ ప్లాన్స్ పై అవగాహన లేకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఆ ప్లాన్స్ ఏంటీ? వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

రూ. 1,849 ప్లాన్

ఈ ప్లాన్ ను కేవలం వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ లు అవసరం ఉన్న వారి కోసం ఎయిర్ టెల్ రూపొందించింది. 365 రోజుల వ్యాలిడిటీతో వచ్చిన ఈ ప్లాన్ (రోజుకు రూ.5 ఖర్చు) ద్వారా ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్, STD, రోమింగ్ కాల్స్ చేసుకోవచ్చు. మెుత్తంగా 3,600 SMSలు వినియోగదారుడికి లభిస్తాయి. అలాగే 3 నెలల అపోలో 24/7 సర్కిల్ సబ్‌స్క్రిప్షన్, ఉచిత హలో ట్యూన్స్ (HelloTunes), స్ప్యామ్ ప్రొటెక్షన్ నెట్‌వర్క్ యాక్సెస్ ను ఉచితంగా పొందవచ్చు. అయితే ప్లాన్ కింద ఎలాంటి డేటా రాదు.

రూ. 2,249 ప్లాన్

Advertisement

కాలింగ్ తో పాటు కొద్దిపాటి డేటా అవసరమున్న వారి కోసం ఎయిర్ టెల్ ఈ రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. దీని కింద 365 రోజుల పాటు అన్ లిమిటెడ్ లోకల్, STD, రోమింగ్ కాల్స్ ఉచితంగా మాట్లాడుకోవచ్చు. డేటా విషయానికి వస్తే 30GB మాత్రమే డేటా లభిస్తుంది. దీనిని ఏడాది పొడవునా పొదుపుగా వాడుకోవచ్చు. అలాగే మెసేజ్ ల కోసం మొత్తం 3,600 SMSలు పొందవచ్చు. ఈ ప్లాన్ అదనపు ప్రయోజనాల కింద Perplexity Pro AI సబ్‌స్క్రిప్షన్ ను ఏడాది పొడవునా ఉచితంగా అందిస్తోంది. అపోలో 24/7 సర్కిల్ (3 నెలలు), ఉచిత హలో ట్యూన్స్ ఈ ప్లాన్ కు సైతం అదనంగా లభిస్తాయి.

Also Read: Samsung HOLI HAI Offer: హోలీ బంపరాఫర్.. శాంసంగ్ ఏసీ, ఫ్రిడ్జ్‌, వాషింగ్ మిషన్‌పై.. రూ.20,000 క్యాష్ బ్యాక్!

రీఛార్జ్ ఏ విధంగా చేసుకోవాలి?

Advertisement

ఎయిర్ థ్యాంక్స్ యాప్ ద్వారా పై రెండు ప్లాన్స్ లో మీకు నచ్చిన దానిని రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా యాప్ ఓపెన్ చేసి రీఛార్జ్ సెక్షన్ లోకి ప్లాన్స్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎయిర్ వెబ్ సైట్, గూగుల్ పే (Google Pay), ఫోన్ పే (Phonepe), పేటీయం (PayTM) వంటి పేమెంట్స్ యాప్ ద్వారా సైతం ఈ వార్షిక ప్లాన్స్ ను పొందవచ్చు. లేదంటే దగ్గరలోని రీటైల్ లేదా మెుబైల్ షాపు వద్దకు వెళ్లి రీఛార్జ్ చేయించుకోవచ్చు.

Also Read: BSNL Budget Plans 2026: BSNL టాప్ – 5 బడ్జెట్ రీఛార్జ్ ప్లాన్స్.. ఖర్చు తక్కువ.. ప్రయోజనాలు ఎక్కువ!

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×