E-Paper
Advertisement

తెలంగాణలో మరో ‘భూపోరు’.. జులై 2న ఉప్పల్ భగాయత్ ముట్టడికి కవిత పిలుపు!

తెలంగాణలో మరో ‘భూపోరు’.. జులై 2న ఉప్పల్ భగాయత్ ముట్టడికి కవిత పిలుపు!
Advertisement

Kavitha: తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవం, హక్కుల సాధన కోసం మరో పోరాటానికి వేదిక సిద్ధమైంది. బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) కార్యాలయంలో ఉద్యమకారుల భూపోరాట పోస్టర్‌ను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ సాధన కోసం తమ జీవితాలను ధారపోసిన ఉద్యమకారులకు ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

జులై 2న ఉప్పల్ భగాయత్ ముట్టడి

Advertisement

ఉద్యమకారులకు ఇస్తామన్న 250 గజాల భూమి విషయంలో ప్రభుత్వం తీవ్రంగా తాత్సారం చేస్తోందని కవిత మండిపడ్డారు. మాటలు చెప్పడం పక్కన పెట్టి, వెంటనే అర్హులైన ఉద్యమకారులను గుర్తించి భూములు కేటాయించాలని స్పష్టం చేశారు. ఈ నిర్లక్ష్యానికి నిరసనగా జులై 2న ఉప్పల్ భగాయత్ లో భూపోరాటం చేపట్టి, ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటామని ఆమె బహిరంగంగా ప్రకటించారు.

తెలంగాణ స్ఫూర్తిపై కుట్రలను తిప్పికొడదాం

Advertisement

ప్రస్తుతం తెలంగాణలో కొన్ని శక్తులు మళ్లీ పాత రోజులను గుర్తు చేస్తూ, తెలంగాణవాదం మీద, ఇక్కడి స్ఫూర్తి మీద దాడి చేయడానికి కుట్రలు పన్నుతున్నాయని కవిత ఆరోపించారు. అలాంటి శక్తుల కుట్రలను తిప్పికొట్టాల్సిన చారిత్రక కర్తవ్యం మనందరిపై ఉందన్నారు. ఈ భూపోరాట కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా ఉద్యమకారుల ఐక్యతను, తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటిచెప్పాలని పిలుపునిచ్చారు.

యువత, మహిళలకు ప్రత్యేక పిలుపు

తెలంగాణ సమాజం బాగుండాలి, రాబోయే తరాల భవిష్యత్తు బాగుండాలని నాడు ఉద్యమకారులు తమ జీవితాలనే త్యాగం చేశారని కవిత గుర్తుచేశారు. అలాంటి వారికి అండగా నిలవాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందన్నారు. అందుకే ఈ పోరాటంలో ముఖ్యంగా యువత, మహిళలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని కోరారు. ఉద్యమకారులకు మంచి జరగాలని ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ కులమతాలకు, పార్టీలకు అతీతంగా తరలివచ్చి జులై 2న జరిగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Also Read: కన్నతండ్రిని రోకలిబండతో కొట్టి చంపిన కొడుకు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×