// // Karimnagar Politics: గెలిచింది ఒక పార్టీ.. చేరింది మరో పార్టీ.. -->
E-Paper
Advertisement

Karimnagar Politics: గెలిచింది ఒక పార్టీ.. చేరింది మరో పార్టీ.. కార్పొరేటర్ జ్యోతి ఇంటి వద్ద హైడ్రామా!

Karimnagar Politics: గెలిచింది ఒక పార్టీ.. చేరింది మరో పార్టీ.. కార్పొరేటర్ జ్యోతి ఇంటి వద్ద హైడ్రామా!
Advertisement

Karimnagar Politics:  కరీంనగర్ జిల్లాలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. చింతకుంట ప్రాంతంలోని 15వ డివిజన్‌లో చోటుచేసుకున్న తాజా పరిణామాలు స్థానికంగా తీవ్ర ఉత్కంఠను రేకెత్తించాయి. ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా విజయం సాధించిన జ్యోతి ఇంటి వద్ద భారీ ఎత్తున ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల ఫలితాల అనంతరం మారిన రాజకీయ సమీకరణాలే ఈ గందరగోళానికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.

రాజకీయ మార్పు – వివాదానికి బీజం

Advertisement

రెండు రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున జ్యోతి కార్పొరేటర్‌గా విజయం సాధించారు. అయితే.. గెలిచిన వెంటనే ఆమె అనూహ్యంగా బీజేపీ (BJP) తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆమె మద్దతు ఏ పార్టీకి ఉంటుందనే అంశంపై సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో కార్పొరేటర్ల కొనుగోలు లేదా ఫిరాయింపుల భయంతో ‘క్యాంపు రాజకీయాలు’ మొదలయ్యాయి.

జ్యోతి ఇంటి వద్ద ఉద్రిక్తత

Advertisement

జ్యోతిని తమతో మాట్లాడించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు ఆమె ఇంటి ముందు ఆందోళనకు దిగారు. మరోవైపు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ విప్ జారీ చేయడంతో.. ఆమె పార్టీ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఆమె తన స్వచ్ఛంద నిర్ణయం మేరకే ఫార్వర్డ్ బ్లాక్ ఏర్పాటు చేసిన క్యాంపునకు వెళ్తున్నానని పోలీసులకు స్పష్టం చేశారు. ఆమె వాహనం ఎక్కి క్యాంపునకు బయలుదేరుతుండగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో తోపులాట జరిగింది.

పోలీసుల మోహరింపు

పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు భారీగా మోహరించారు. బీజేపీలో చేరిన తర్వాత కూడా తిరిగి ఫార్వర్డ్ బ్లాక్ క్యాంపునకు ఎలా వెళ్తారని బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే.. జ్యోతి మాత్రం పోలీసుల భద్రత నడుమ క్యాంపునకు వెళ్లడంతో ఆందోళనకారులు నిరసనను ఉధృతం చేశారు. ప్రస్తుతం చింతకుంటలో వాతావరణం నివురు గప్పిన నిప్పులా ఉంది.

Also Read:మహాశివరాత్రి వేళ మారణహోమం.. ఆటోలో వచ్చి అడ్డగించి.. కర్రలతో కొట్టి..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×