E-Paper
Advertisement

Bandi Sanjay: బీజేపీని మేయర్ అవ్వకుండా అడ్డుకుంటే మరో యుద్దం తప్పదు.. బండి సంజయ్ వార్నింగ్!

Bandi Sanjay: బీజేపీని మేయర్ అవ్వకుండా అడ్డుకుంటే మరో యుద్దం తప్పదు.. బండి సంజయ్ వార్నింగ్!
Advertisement

Bandi Sanjay: కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీని మేయర్ అవ్వకుండా అడ్డుకోవాలని చూస్తే.. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం నేతలను రోడ్లపై తిరగనివ్వబోమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. బీజేపీ మేయర్ అవ్వకూడదని కరీంనగర్ లో ఈ మూడు పార్టీలు ఒక్కటయ్యాయని ఆరోపించారు. బీజేపీ మేయర్ అవ్వడాన్ని అడ్డుకోవాలని చూస్తే వారి బతుకులను బర్ బాద్ చేస్తానని బండి వార్నింగ్ ఇచ్చారు. వారి రాజకీయాన్ని నాశనం చేస్తానని హెచ్చరించారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయి ఉంటే ఆయన నుంచే తన యుద్ధం మొదలుపెడతానన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై లక్షల మందిని రోడ్డెక్కించి సీఎంను నిలదీస్తానని స్పష్టంచేశారు. ఎవరేం చేసినా కరీంనగర్ మేయర్ బీజేపీదేనని ఆయన ధీమా వ్యక్తంచేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

లోకల్ నేతలు మాట్లాడుకున్నారా?

కాంగ్రెస్(CONGRESS), బీఆర్ఎస్(BRS), ఎంఐఎం(MIM).., మూడు పార్టీలకు కలిపినా వారికి ఉన్న సంఖ్యతో ఎలా మేయర్ అవుతారని బండి ప్రశ్నించారు. తమ పార్టీ నేతలకు ఫోన్ చేసి డబ్బులు ఇస్తామని ప్రలోభ పెడుతున్నారని, అయితే.. బీజేపీ నేతలు వాళ్లను ఛీకొడుతున్నారన్నారు. కరీంనగర్ మేయర్ పీఠం గురించి కాంగ్రెస్, బీఆర్ఎస్ కలవాలనే నిర్ణయంపై లోకల్ నేతలు మాట్లాడుకున్నారా? లేక అధిష్టానాలు మాట్లాడుకున్నాయా? అనేది ప్రజలకు తెలియాలని సంజయ్ వ్యాఖ్​యానించారు. కరీంనగర్ అభ్యర్థుల ఎంపిక సైతం రెండు పార్టీల్లో లోపాయికార ఒప్పందంతో జరిగిందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే అని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని, వీళ్ల బండారం, కుట్ర కరీంనగర్ తో బయట పడబోతోందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వి రహస్య చర్చలు కాదని, బహిరంగంగానే చర్చలు జరుపుతున్నారన్నారు. సీఎం ఫోన్ కాల్ చేశారని సాక్షాత్తు లోకల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ కార్పొరేటర్ల చెబుతున్నారని సమాచారం ఉందన్నారు.

Advertisement

Also Read: Anchor Ravi: మేము అటు స్టార్స్ కాదు.. ఇటు నార్మల్ పబ్లిక్ కాదు. మధ్యలో ఉన్నాం

తిండి, నిద్ర మాని తీవ్రంగా కష్టపడ్డాం

కరీంనగర్ లతో ఎంఐఎంను 8 స్థానల నుంచి 3 సీట్లకు పరిమితం చేశామని బండి చెప్పారు. పెన్షనర్లతో పాటు హామీల బాధితులందరితో తాను మాట్లాడుతున్నానని, కరీంనగర్ నుంచే కాంగ్రెస్, బీఆర్ఎస్ కు సెగ తగిలిస్తానని బండి సవాల్ చేవారు. ఈ రెండు పార్టీలకు దాన్ని తట్టుకునే దమ్ముందా? అని సవాల్ విసిరారు. తాను కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల్లా చిల్లర రాజకీయాలు చేయబోనని, వారు చేస్తే కూడా ఊరుకోబోనని స్పష్​టంచేశారు. తాము తిండి, నిద్ర మాని తీవ్రంగా కష్టపడ్డామని బండి వ్యాఖ్యానించారు. కానీ మైండ్ లేనోడు.. మైండ్ గేమ్ ఆడుతున్నట్టుగా పరిస్థితి మారిందని ఎద్దేవాచేశారు. ఒక్క మేయర్ పీఠం కోసం ఇంతలా దిగజారలా? అని ప్రశ్నించారు. తాము ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నామని, తమ ఓటింగ్ శాతం గతం కంటే భారీగా పెరిగిందన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా బలపడతామని, అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తంచేశారు.

Advertisement

Also Read: Manasa Varanasi : మిస్ ఇండియా మానస సినిమాలకు గ్యాప్ తీసుకోవడానికి కారణం ఇదే..?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×