E-Paper
Advertisement

Kamareddy News: కుక్కల మరణాల కేసు వేళ సర్పంచ్‌కు మరో షాక్.. కొండముచ్చుల నిర్బంధంపై ఫారెస్ట్ అధికారుల సీరియస్!

Kamareddy News: కుక్కల మరణాల కేసు వేళ సర్పంచ్‌కు మరో షాక్.. కొండముచ్చుల నిర్బంధంపై ఫారెస్ట్ అధికారుల సీరియస్!
Advertisement

Kamareddy News: కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రంలో వీధి కుక్కలపై విష ప్రయోగం జరిగిన ఘటన మరవకముందే, సర్పంచ్ శేఖర్ చుట్టూ మరో వివాదం ముసురుకుంది. వన్యప్రాణుల సంరక్షణ నిబంధనలకు విరుద్ధంగా రెండు కొండముచ్చులను బంధించిన వ్యవహారంలో ఆయనపై అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు.

పాల్వంచ మండల కేంద్రానికి చెందిన సర్పంచ్ శేఖర్, ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా రెండు కొండముచ్చులను పట్టుకుని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలోని ఒక పంజరంలో బంధించారు. ఈ విషయం జంతు ప్రేమికుడు గౌతమ్ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

వన్యప్రాణులను అలా నిర్బంధించడం చట్టరీత్యా నేరమని, ఇది జంతు హింస కిందకు వస్తుందని గౌతమ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పందించిన ఫారెస్ట్ అధికారులు గ్రామానికి చేరుకుని సర్పంచ్ శేఖర్‌ను వివరణ కోరారు. వన్యప్రాణులను బంధించడంపై ఆయనకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

అటవీ శాఖ అధికారుల సమక్షంలో పంజరంలో ఉన్న రెండు కొండముచ్చులను విడిపించి, వాటిని సురక్షితంగా సమీపంలోని అడవిలో వదిలిపెట్టారు. ఇప్పటికే వీధి కుక్కల మరణాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సర్పంచ్, ఇప్పుడు వన్యప్రాణుల నిర్బంధం కేసులో కూడా చిక్కుకోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Read Also: మహిళా IAS వ్యవహారంలో బీఆర్ఎస్ కుట్ర.. తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×