E-Paper
Advertisement

Workout Laziness: చలిగా ఉందని వ్యాయామం మానేస్తున్నారా? ప్రమాదంలో పడినట్లేనని హెచ్చరిస్తున్న నిపుణులు!

Workout Laziness: చలిగా ఉందని వ్యాయామం మానేస్తున్నారా? ప్రమాదంలో పడినట్లేనని హెచ్చరిస్తున్న నిపుణులు!
Advertisement

Workout Laziness: శీతాకాలంలోనూ సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలంటే మంచి పోషకాలున్న ఆహారంతో పాటు శరీరానికి కావాల్సిన వ్యాయాయమూ ఎంతో అవసరం. ఈ క్రమంలో చాలామంది ఉదయం లేచి వ్యాయామం చేయాలంటే బద్దకిస్తుంటారు. ఒకవేళ వర్కౌట్స్ స్టార్ట్ చేసినా.. కాసేపటికే నీరసించి పోతుంటారు. దీనికి కారణం శరీరంలో శక్తి లేకపోవడం కాదు.. మనసులో సరైన దృక్పథం లేకపోవడమే అని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామాన్ని ఒక భారంగా కాకుండా.. ఆరోగ్యానికి ఉపయోగపడే మంచి అలవాటుగా భావిస్తే ఈ సమస్యను సులభంగా అధిగమించవచ్చంటున్నారు. దీనికోసం పాటించాల్సిన చిన్న చిన్న పద్ధతులేవో ఇప్పుడు తెలుసుకుందాం.

వ్యాయామం చేయాలంటే ముందుగా.. ఇది నేనెందుకు ఎందుకు చేస్తున్నాను? అనే ప్రశ్నకు సమాధానం వెతుక్కోవాలి. రోజును చురుగ్గా ఉంచుకోవాలనుకోవడం, జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలనుకోవడం, శరీర నొప్పులు తగ్గాలని కోరుకోవడం.. ఇలా ప్రతి ఒక్కరికీ వేర్వేరు కారణాలు ఉంటాయి. మీ లక్ష్యం ఏదో స్పష్టంగా తెలిసినప్పుడు వ్యాయామంపై దృష్టి పెట్టడం ఈజీ అవుతుంది. వర్కౌట్ స్టార్ట్ చేయాలి అనిపించినప్పుడు.. మీరు ఎంచుకున్న కారణాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే బద్ధకం పారిపోతుంది.

Advertisement

Also Read: డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.. వారంలో రెండుసార్లు తలకాయ కూర తింటే జరిగేది ఇదే!

మనసుకు నచ్చిన పని చేస్తే.. ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తాం. వ్యాయామం విషయంలో కూడా ఇదే నియమాన్ని పాటించాలి. అయితే ప్రతి ఒక్కరికీ ఒకే రకమైన వర్కౌట్స్‌ నచ్చాల్సిన అవసరం లేదు. కొందరికి నడక ఇష్టమైతే.. మరికొందరికి జాగింగ్‌, ఇంకొందరికి పుష్‌అప్స్‌ లేదా వెయిట్స్‌ ఇష్టం ఉంటుంది. అలాగే మీకు ఏది ఇష్టం అనిపిస్తే.. అదే ఎంచుకుంటే వ్యాయామం ఒక పనిలా కాకుండా.. మీకు ఇష్టమైన అలవాటుగా మారుపోతుంది.

Advertisement

కొంతమంది ఫలితాలు త్వరగా రావాలనే ఉత్సాహంతో.. మొదటి నుంచే కఠినమైన వ్యాయామాలు చేస్తుంటారు. దీంతో శరీరం త్వరగా అలసిపోతుంది. అప్పుడు వ్యాయామం అంటేనే భయం మొదలవుతుంది. అందుకే మొదట సులువైన వ్యాయామాలతో ప్రారంభించడం ఉత్తమం. వాకింగ్, తేలికపాటి జాగింగ్‌, సైక్లింగ్‌ లాంటి వాటితో మొదలు పెట్టి.. శరీరం అలవాటు పడిన తర్వాతే క్రమంగా తీవ్రత పెంచుకోవాలి. ఇలా చేస్తే శరీరానికి అలసట లేకుండా వ్యాయామాన్ని పూర్తి చేస్తారు.

అలాగే కొంతమందికి ఒంటరిగా వ్యాయామం చేయడం కష్టంగా అనిపిస్తుంటుంది. అలాంటి వారు ఫ్రెండ్స్‌తో కలిసి లేదా పెట్స్‌తో వాకింగ్‌ చేయడం వల్ల ఒంటరితనం దూరమవుతుంది. మధ్యలో బోర్‌ కొట్టినా లేదా మానేయాలనిపించినా.. తోడు ఉన్నవారు మళ్లీ ప్రోత్సహించే అవకాశం ఉంటుంది. దీంతో వ్యాయామం చేసే అలవాటు దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది.

జిమ్ లేదా యోగా వంటి వ్యాయామాలు ప్రారంభించిన వెంటనే పెద్ద పెద్ద మార్పులను ఆశించడం మూర్ఖత్వమే అవుతుంది. మీరు ఆశించిన ఫలితాలు కనిపించడానికి కొంత సమయం పడుతుందనే నిజాన్ని గ్రహించాలి. అందుకే చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుని ఓపికగా కంటిన్యూ చేయాలి. రోజులో కాసేపు వాకింగ్ చేయడం నుంచి స్టార్ట్ చేయాలి. అలా క్రమంగా మీరు అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నించాలి. దీంతో మీవల్ల కానిది ఏదీ లేదనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

Also Read: వీలైతే ఈ పండును రోజూ తినండి.. ఎంతటి మొండి వ్యాధులైనా పారిపోవాల్సిందే!

 

 

 

 

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×