E-Paper
Advertisement

పవన్ కళ్యాణ్‌కు.. తెలంగాణలో ఏం పని.. మళ్లీ విరుచుకుపడ్డ కవిత

పవన్ కళ్యాణ్‌కు.. తెలంగాణలో ఏం పని.. మళ్లీ విరుచుకుపడ్డ కవిత
Advertisement

Kalvakuntla Kavitha: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మరోమారు నిప్పులు చెరిగారు. హైదరాబాద్ మణికొండలో జనసేన కార్యాలయాన్ని పవన్ ప్రారంభించిన నేపథ్యంలో.. ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. అసలు తెలంగాణలో మీకేం పని అంటూ పవన్ ను నిలదీశారు. సినిమాల ముసుగులో వచ్చి తెలంగాణను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆయన సినిమాలు చూసి సంతోషిస్తాం కానీ సెక్రటేరియట్ వైపు చూస్తే మాత్రం ఊరుకోమని హెచ్చరించారు.

వరంగల్ జిల్లాలో పర్యటన సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు. ఏపీలో డిప్యూటీ సీఎంగా ఉన్నందున ఆ రాష్ట్రంలో రాజకీయాలు చేసుకోవాలని కవిత సూచించారు. ఇక్కడ సినిమాలు తీసుకోవాలని హితవు పలికారు. సినిమాల పరంగా పవన్ ఓకే గానీ.. రాజకీయాలకు మాత్రం అతడు అన్ ఫిట్ అంటూ మండిపడ్డారు. గతంలో తెలంగాణ భాషను వెక్కిరించి.. రాష్ట్రాన్ని కబ్డా చేశారని పవన్ పై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

మరోవైపు గత పాలకులు ఉమ్మడి వరంగల్ జిల్లాను ఆగం పట్టించారని కవిత ఆరోపించారు. ఇక్కడ విద్య, వైద్యం, ఉద్యోగ కల్పనలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్క విద్యా సంస్థ వరంగల్ కు రాలేదని కవిత గుర్తుచేశారు. స్థానిక ఎంజీఎం ఆస్పత్రిని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టులో మంత్రులు పొంగులేటి, సీతక్క కలిసి ఇసుక దోపిడి చేస్తున్నారని కవిత ఆరోపించారు.

Advertisement

Also Read: రైతు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షం.. అన్నదాత సుఖీభవపై.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఇదిలా ఉంటే తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న వ్యాఖ్యలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కార్యరూపం ఇచ్చారు. హైదరాబాద్ లోని మణికొండలో పార్టీ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన స్వయంగా ప్రారంభించారు. తెలంగాణ గడ్డపై జనసేనకు సంబంధించి ఇదే తొలి కార్యాలయం కావడం విశేషం. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు, వీర మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సంబురాలు చేసుకున్నారు. తెలంగాణలో జనసేన సత్తా ఏంటో చాటిచెప్పేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని నేతలు, కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు.

Also Read: కాంగ్రెస్ నేత దారుణ హత్య.. 20 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు.. పదంసింగ్ పాటిల్ నిర్దోషి

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×