E-Paper
Advertisement

Kavitha: కూలి రైతుగా మారిన కవిత.. చేనులో పత్తి తీసి రైతులతో మాట్లాడి..!

Kavitha: కూలి రైతుగా మారిన కవిత.. చేనులో పత్తి తీసి రైతులతో మాట్లాడి..!
Advertisement

Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా రైతులు, వ్యవసాయ కూలీలతో మమేకమయ్యారు. జాగృతి జానం బాట కార్యక్రమంలో ఆమె జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే.. చెనాకా – కొరాటా బ్యారేజ్ సమీపంలోని పత్తి చేనులో పత్తి తీస్తున్న మహిళా కూలీలను ఆమె కలిశారు. కేవలం పలకరించి వెళ్లడమే కాకుండా.. వారితో కలిసి ముచ్చటిస్తూ.. కొంత సమయం పాటు కవిత స్వయంగా పత్తి తీశారు.

ఉదయం నుంచి చేనులో శ్రమిస్తున్న మహిళా కూలీల వద్దకు చేరుకున్న కవిత వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పత్తి తీసే విధానాన్ని దగ్గరుండి చూశారు. అనంతరం.. కవిత కూడా వారితో కలిసి పత్తి తీయడం మొదలుపెట్టారు. చకచకా పత్తి తీస్తూ.. కూలీల కష్టం ఎంత గొప్పదో స్వయంగా అనుభవించారు. ఈ దృశ్యం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి.. ఆనందానికి గురిచేసింది.

Advertisement

పత్తి తీస్తున్న సమయంలోనే.. కవిత కూలీలతో మాటామంతి జరిపారు. వారి కుటుంబ నేపథ్యాలు, పిల్లల చదువులు, పొలంలో ఎదురవుతున్న ఇబ్బందులు, ముఖ్యంగా పత్తికి వస్తున్న ధర, కూలీల గిట్టుబాటు వంటి విషయాలపై ఆమె ఆరా తీశారు. కూలీల దైనందిన జీవితంలో ఎదురవుతున్న కష్టసుఖాలను ఓపికగా విన్నారు. పత్తి తీయడానికి రోజుకు ఎంత కూలీ వస్తుంది..? ఎంత సమయం పనిచేయాల్సి వస్తుంది..? వంటి వివరాలను తెలుసుకున్నారు. కూలీలు కూడా తమ సమస్యలను, ప్రభుత్వ పథకాల గురించి తమ అభిప్రాయాలను కవితతో పంచుకున్నారు.

ALSO READ: Jubilee Hills bypoll: సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం.. కాంగ్రెస్‌లో ఫుల్ జోష్, జూబ్లీ వార్ వన్ సైడేనా..?

Advertisement

కూలీలతో గడిపిన అనంతరం కవిత మాట్లాడుతూ.. ‘తెలంగాణలో వ్యవసాయం పండుగలా మారడానికి కారణం రైతులతో పాటు పొలంలో శ్రమించే ఈ కూలీలే. మహిళలు ఇంటి పనులతో పాటు పొలం పనుల్లోనూ చురుకుగా పాల్గొంటూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. వీరి శ్రమ వెలకట్టలేనిది. వీరికి సరైన గిట్టుబాటు ధర, మెరుగైన సౌకర్యాలు అందాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. పత్తికి మంచి ధర లభించాలని.. కూలీల కష్టానికి తగిన ఫలితం దక్కాలని ఆమె ఆకాంక్షించారు.

ALSO READ: Pawan Kalyan: ఆలయాల్లో భక్తుల భద్రత, సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించండి.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

మొదట ఆశ్చర్యపోయినా.. తమతో కలిసి కవిత పత్తి తీయడంపై మహిళా కూలీలు సంతోషం వ్యక్తం చేశారు. తమ కష్టాన్ని గుర్తించినందుకు.. తమతో కలిసి పనిచేసినందుకు వారు కవితకు ధన్యవాదాలు తెలిపారు. రాజకీయ నాయకురాలు తమతో కలిసి పనిచేయడం తమకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చిందని వారు పేర్కొన్నారు. ఈ పర్యటన ద్వారా కవిత సామాన్య ప్రజల కష్టాలను దగ్గరగా చూసి తెలుసుకోవడానికి ప్రయత్నించారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×