E-Paper
Advertisement

Fever: జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయాలా? వద్దా?.. మీక్కూడా ఈ డౌట్ ఉంది కదూ!

Fever: జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయాలా? వద్దా?.. మీక్కూడా ఈ డౌట్ ఉంది కదూ!
Advertisement

Fever: వర్షాకాలంలో అయినా, శీతాకాలంలో అయినా వైరల్ ఫీవర్స్ రావడం సర్వసాధారణం. అయితే ఈ వైరల్ ఫీవర్స్ అనేది ఒక్కోసారి చాలా ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు వానాకాలంలో దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అయితే, జ్వరం వచ్చిన ప్రతిసారీ అందరూ చెప్పే మాటేంటంటే.. జ్వరం తగ్గే వరకు స్నానం చేయకూడదని సలహా ఇస్తుంటారు. స్నానం చేయడం వల్ల జ్వరం తీవ్రత ఇంకా పెరుగుతుందని భయపెడుతుంటారు. అయితే, ఇది ఎంతవరకు నిజమనేది ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తవం ఏమిటంటే:

వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు శరీరంలో అనేక నొప్పులు ఇబ్బంది పెడుతుంటాయి. ఆ సమయంలో స్నానం చేయొద్దని చెప్పే ఈ పాత నమ్మకం కేవలం అపోహ మాత్రమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మొత్తానికే స్నానం చేయకుండా ఉండటం కంటే.. జ్వరం ఉన్నప్పుడు ఏ రకమైన స్నానం మేలు చేస్తుంది? ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ముందుగా తెలుసుకోవాలంటున్నారు వైద్యులు.

స్నానం.. పరిశుభ్రత కోసమే:

Advertisement

జ్వరం వచ్చినప్పుడు శరీరం ఉష్ణోగ్రత పెరుగుతుంది, అసౌకర్యంగా ఉంటుంది. అలాంటప్పుడు స్నానం చేయడం అనేది కేవలం పరిశుభ్రత కోసం కాదు.. శరీరాన్ని ఉత్తేజపరచానికి కూడా సహాయపడుతుంది. జ్వరం ఉన్నప్పుడు స్నానం చేయకూడదు అనేది ఒక అపోహ మాత్రమే అంటున్నారు ఆరోగ్య నిపుణఉలు. ఫీవర్ ఉన్నప్పుడు స్నానం చేయడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత సమతుల్యత చెందుతుందే తప్పా ఎలాంటి నష్టం వాటిల్లదు అని చెబుతున్నారు.

వైద్య నిపుణులు ఏమంటున్నారు?

జ్వరంతో ఇబ్బంది పడుతన్నప్పుడు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు వైద్య నిపుణులు. ఆ సమయంలో స్నానం చేయడం వల్ల జ్వరం కారణంగా వచ్చే అలసట, ఒళ్లు నొప్పులు, చిరాకు తగ్గిపోతాయి. అంతేకాదు.. పరిశుభ్రత వల్ల మానసికంగా కూడా రిఫ్రెష్‌గా అనిపిస్తుంది. అయితే, చల్లని నీటితో స్నానం చేయకపోవడమే ఉత్తమం. ఎందుకంటే, చల్లని నీటి ద్వారా శరీరంలో చలి మొదలవుతుంది. దీంతో జ్వరం మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

ఈ పొరపాట్లు చేయొద్దు:

Advertisement

ఫీవర్ వచ్చినప్పుడు ఎక్కువ సమయం నీటిలో ఉండకపోవడం మంచిది. 5 నుంచి 10 నిమిషాల్లో స్నానం ముగించాలి. అంతేకాకుండా పొడి తవల్‌తో శరీరాన్ని శుభ్రంగా తుడుచుకుని.. వెచ్చని దుస్తులు ధరించాలి. ఒకవేళ జ్వరం మరీ ఎక్కువగా ఉంటే.. గోరువెచ్చని నీటిలో కాటన్ టవల్‌ను తడిపి, శరీరాన్ని తుడిస్తే సరిపోతుంది.

ఆ నమ్మకం అశాస్త్రీయమే:

చాలామంది ఇచ్చే సలహా.. జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయకూడదు అని. అయితే, ఈ నమ్మకం కేవలం అశాస్త్రీయమైనది. ఎందుకంటే.. అసౌకర్యంగా అనిపించినప్పుడు, భయం లేకుండా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శారీరక, మానసిక ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ఈ స్నానం పరోక్షంగా సహాయపడుతుంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×