E-Paper
Advertisement

అసైన్డ్ భూములపైనే కాంగ్రెస్ కన్ను.. రైతుల భూములు లాక్కుంటే ఊరుకోం: కల్వకుంట్ల కవిత

అసైన్డ్ భూములపైనే కాంగ్రెస్ కన్ను.. రైతుల భూములు లాక్కుంటే ఊరుకోం: కల్వకుంట్ల కవిత
Advertisement

Kalvakuntla Kavitha: వికారాబాద్ జిల్లా పరిగిలో భూసేకరణకు వ్యతిరేకంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. పరిగి ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ప్రభుత్వం సేకరిస్తున్న భూములను అడ్డుకునే వరకు విశ్రమించేది లేదని ఆమె హెచ్చరించారు. బుధవారం వికారాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్‌తో కలిసి బాధిత రైతులతో ఆమె ధర్నాకు దిగారు.

పరిగి మండలంలోని కళ్లాపూర్, రాపోల్, భట్ల చందారం గ్రామాల్లో పరిశ్రమల కోసం 1250 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరిస్తోంది. దీనికి వ్యతిరేకంగా సుమారు నాలుగు గంటల పాటు నడిఎండలో కవిత రోడ్డుపైనే బైఠాయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా ఫోన్ చేసి ఆందోళన విరమించాలని కోరగా, “భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా లేరు.. మీరే స్వయంగా వచ్చి వారి అభ్యంతరాలు వినాలి” అని ఆమె స్పష్టం చేశారు. కలెక్టర్ నుండి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఆందోళన కొనసాగించారు. అనంతరం పోలీసులు ఆమెను బలవంతంగా అరెస్ట్ చేసి బంటారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది.

Advertisement

ప్రభుత్వం సేకరిస్తున్న 1250 ఎకరాల్లో 1000 ఎకరాలు అసైన్డ్ భూములేనని, మిగిలినవి ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులవేనని కవిత పేర్కొన్నారు. “చిన్న, సన్నకారు రైతుల నోటికాడి బుక్కను లాక్కోవడమే కాంగ్రెస్ లక్ష్యమా?” అని ఆమె మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాం కంటే దారుణంగా నేడు రైతుల పరిస్థితి తయారైందని, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్య కారక పరిశ్రమలను మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఏర్పాటు చేసి మళ్లీ మూసీని కలుషితం చేస్తారా అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని, త్వరలోనే తెలంగాణకు రాబోయే ప్రాంతీయ పార్టీ ద్వారా మరిన్ని ఉద్యమాలు చేస్తామని ప్రకటించారు.

నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) పేరుతో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చూస్తోందని కవిత ఆరోపించారు. జనాభా నియంత్రణ పాటించి దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ వంటి రాష్ట్రాలకు సీట్లు తగ్గించడం అన్యాయమన్నారు. ప్రస్తుతం ఉన్న 3.13 శాతం ప్రాతినిధ్యాన్ని పెంచాల్సింది పోయి, తగ్గించాలని చూడటం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడమేనని విమర్శించారు. తెలంగాణ రాజకీయ సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు అవసరమైతే మరో ఉద్యమానికి సిద్ధమని ఆమె పిలుపునిచ్చారు.

Advertisement

Read Also: ఇష్టారీతిన డీమిలిటేషన్ చేస్తే.. ఊరుకునేదే లేదు.. కేంద్రానికి ఎంపీ చామల వార్నింగ్!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×