E-Paper
Advertisement

బద్రి ఆఫర్ అలా వచ్చింది.. డైరెక్టర్ కి కండీషన్ పెట్టిన రేణూ.. అసలు కథ ఏంటంటే?

బద్రి ఆఫర్ అలా వచ్చింది.. డైరెక్టర్ కి కండీషన్ పెట్టిన రేణూ.. అసలు కథ ఏంటంటే?
Advertisement

Renu Desai:ప్రముఖ సినీనటి, కాస్ట్యూమ్ డిజైనర్.. రేణూ దేశాయ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె పవన్ కళ్యాణ్ తో బద్రి, జానీ వంటి చిత్రాలు చేసి.. ఆయనతో సహజీవనం చేసి పెళ్ళికి ముందే కొడుకుకు జన్మనిచ్చింది. పెళ్లి తర్వాత ఆధ్య పుట్టింది. కొన్నాళ్లు సంతోషంగా ఉన్న ఈ జంట విడిపోయారు. దీంతో పిల్లల్ని తీసుకొని ముంబైలో సెటిల్ అయింది రేణు దేశాయ్. అక్కడే పలు మూగజీవుల కోసం స్వచ్ఛంద సేవా సంస్థలు నిర్వహిస్తూ.. పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ కెరీర్ను కొనసాగిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనపై వచ్చే ట్రోల్స్ ను తిప్పికొడుతూ బిజీగా మారిన రేణూ దేశాయ్ తన తొలి సినిమా బద్రి గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.

డైరెక్టర్ కి కండిషన్ పెట్టాను..

రేణూ దేశాయ్ మాట్లాడుతూ..” నేను నటించిన యాడ్స్ చూసి ఈ సినిమాలో నాకు పూరీ జగన్నాథ్ అవకాశం ఇచ్చారు. అయితే ఈ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కి నేను కండిషన్ పెట్టాను. అదేంటంటే నా పాత్రకు సంబంధించిన కాస్ట్యూమ్స్ ని నేనే చూసుకుంటానని.. అందుకు ఆయన కూడా ఓకే చెప్పారు. నేను ముక్కుసూటిగా మాట్లాడుతాను. సినీ పరిశ్రమకు అది సెట్ కాదు.. అందుకే మొదట నన్ను వద్దని చెప్పారు. ఇక బద్రి తర్వాత తమిళంలో జేమ్స్ పాండు సినిమాలో నటించే అవకాశం వచ్చింది . ఇక ప్రభుదేవా మూవీ కావడంతో నటించేందుకు నేను ఫోన్ లోనే అంగీకరించాను అంటూ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

చివరి క్షణంలో హీరోయిన్ గా చేయాల్సి వచ్చింది..

Advertisement

అలాగే జానీ సినిమా గురించి కూడా మాట్లాడుతూ..” నేను ఈ సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేశాను. అయితే ఆ సమయంలో హీరోయిన్గా ఎవరు సెట్ కాకపోవడంతో చివరికి నేనే హీరోయిన్గా నటించాల్సి వచ్చింది” అంటూ రేణూ దేశాయ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే గతంలో రైతుల జీవితాలు, వారి సమస్యలపై ఒక సినిమా చేయబోతున్నట్లు ప్రకటించింది. ఎందుకంటే ఇప్పటికే ఆమె ఇష్క్ వాలా లవ్ అనే చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అందుకే ఆ టాలెంట్ తో ఈ సినిమా చేస్తానని హామీ ఇచ్చింది.

also read:మీ ఇంటి ఆడబిడ్డను ఇలాగే ఏడిపిస్తారా.. సింగర్ మంగ్లీ ఎమోషనల్!

రేణూ దేశాయ్ సినిమాలు..

Advertisement

ఇక ప్రస్తుతం 16 రోజుల పండుగ చిత్రంతో పాటు మరో తెలుగు సినిమాలో అలాగే ఒక షార్ట్ ఫిలిం లో కూడా రేణూ దేశాయ్ నటిస్తోంది. ఇకపోతే జానీ మూవీ తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమైన రేణూ దేశాయ్ మళ్ళీ 20 ఏళ్ల తర్వాత రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది.. ఇక ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది రేణూ దేశాయ్.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×