E-Paper
Advertisement

Jeevan Reddy: కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి గుడ్ బై చెప్పనున్నారా..? సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి..!

Jeevan Reddy: కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి గుడ్ బై చెప్పనున్నారా..? సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి..!
Advertisement

జగిత్యాల రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గత కొంతకాలంగా సాగుతున్న ప్రచారానికి బలం చేకూరుస్తూ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మనసులోని మాటను బయటపెట్టారు. కాంగ్రెస్ పార్టీలో తన భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తెగ హాట్ టాపిక్ గా మారింది.

పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన నేరుగా సమాధానమిచ్చారు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే మీడియాకు తెలియకుండా జరగదని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుండే నియోజకవర్గ పరిస్థితులపై తనకు అసంతృప్తి ఉందని గుర్తు చేశారు. ఆ రోజే భవిష్యత్తు కార్యాచరణపై సూచనప్రాయంగా మాట్లాడానని తెలిపారు. పార్టీలో కొనసాగాలా లేదా అనే అంశంపై తీవ్రమైన మథనం జరుగుతోందని ఒప్పుకున్నారు.

Advertisement

ప్రస్తుతానికి తాను ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదని ఆయన వెల్లడించారు. ‘చూద్దాం.. లెట్ ఇట్ సీ’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. పార్టీలో తలెత్తిన అంతర్గత పరిణామాలు, స్థానిక నాయకత్వంతో ఉన్న విభేదాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడూ కార్యకర్తల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చానని చెప్పారు. సమయం సందర్భం వచ్చినప్పుడు అందరికీ తెలిసేలా నిర్ణయం ప్రకటిస్తానని హామీ ఇచ్చారు.

మీడియా ద్వారానే తన తదుపరి అడుగును వెల్లడిస్తానని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. అనవసరపు ఊహాగానాలకు తావులేకుండా నేరుగా ప్రజల ముందుకు వస్తానన్నారు. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం, కార్యకర్తల గౌరవం కోసం ఏ నిర్ణయానికైనా వెనుకాడబోనని ఆయన మాటల్లో స్పష్టంగా తెలుస్తోంది. ఈ సమావేశంతో కాంగ్రెస్ అధిష్ఠానానికి ఆయన ఒక పరోక్ష హెచ్చరిక పంపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. జిల్లా రాజకీయాల్లో తన పట్టు నిరూపించుకునే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు.

Advertisement

ALSO READ: BRS workshop: వర్క్ షాప్ కు కేసీఆర్ దూరం.. నేడు తొలిసారి పార్టీ సభ్యులకు ట్రైనింగ్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×