E-Paper
Advertisement

Janasena: తెలంగాణ‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫోక‌స్.. జనసేన బలోపేతం దిశగా మరో అడుగు!

Janasena: తెలంగాణ‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫోక‌స్..  జనసేన బలోపేతం దిశగా మరో అడుగు!
Advertisement

Janasena: తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా “తెలంగాణ రాష్ట్ర జనసేన ఉద్మమి సభ్యత్వ నమోదు కార్యక్రమం” కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 26వ తేదీ నుండి దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాలని పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో, తెలంగాణలో ఈ ప్రక్రియను విజయవంతం చేయడానికి జిల్లాల వారీగా, గ్రేటర్ పరిధిలోని కార్పొరేషన్లకు ఇన్ఛార్జులను నియమించారు.

పార్టీ కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేసి, తమకు కేటాయించిన ప్రాంతాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ కేంద్ర కార్యాలయం కోరింది. గ్రేటర్ పరిధిలో నూతనంగా విభజించబడిన కార్పొరేషన్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించింది.

Advertisement

రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించే బాధ్యతను పార్టీ ఉపాధ్యక్షులు బోంగునూరి మహేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు రాధారం రాజలింగం, శ్రీమతి కావ్య మండపాక మరియు శ్రీమతి శిరీష పొన్నూరులకు అప్పగించారు. వీరు రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ నమోదు ప్రక్రియను పర్యవేక్షిస్తూ, కింది స్థాయి నాయకులకు దిశానిర్దేశం చేస్తారు. పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడమే లక్ష్యంగా ఈ కమిటీలు పనిచేయనున్నాయి.

  • ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ – మహబూబ్‌నగర్ & సైబరాబాద్ కార్పొరేషన్

  • మాడిరెడ్డి దామోదర్ రెడ్డి – వరంగల్ & హైదరాబాద్ కార్పొరేషన్

  • మేకల సతీష్ రెడ్డి – భువనగిరి, నల్గొండ

  • మాచ సుధాకర్ – నిజామాబాద్ & మేడ్చల్ మల్కాజిగిరి

  • సంపత్ నాయక్ – జహీరాబాద్

  • మిరియాల రామకృష్ణ – ఖమ్మం

  • వేముల కార్తీక్ – కొత్తగూడెం, ఇల్లందు, పెనుపాక, భద్రాచలం నియోజకవర్గాలు

  • మంథని సంపత్ కుమార్ – పెద్దపల్లి, ఆదిలాబాద్

  • చిరాగ్ ప్రాజిత్ గౌడ్ – చేవెళ్ల

  • ఆర్.కె. సాగర్ (ఆర్.కె. నాయుడు) – కరీంనగర్

  • దాసరి రవీష్ – మహబూబాబాద్

  • యదామ రాజేష్ – మెదక్

  • బి. మహేష్ నాయుడు – నాగర్‌కర్నూల్

Read Also: Minister Seethakka: మహిళల సమగ్రాభివృద్ధికి శాఖల మ‌ధ్య సమన్వయం పెర‌గాలి : మంత్రి సీతక్క

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×