E-Paper
Advertisement

జగిత్యాల భూ వివాదం.. కాంగ్రెస్ సర్కార్‌పై జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు!

జగిత్యాల భూ వివాదం.. కాంగ్రెస్ సర్కార్‌పై జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు!
Advertisement

Jagtial: జగిత్యాల జిల్లా రాజకీయాల్లో భూ కేటాయింపులు, పాఠశాలల నిర్మాణ కాంట్రాక్టుల అంశం తీవ్ర దుమారం రేపుతోంది. జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగిత్యాల అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివక్ష చూపుతున్నారని ఆయన ఆరోపించారు.

భూ కేటాయింపుల్లో కోతపై ప్రశ్నల వర్షం

Advertisement

జగిత్యాలకు మంజూరైన కేంద్రీయ విద్యాలయం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూమి కేటాయింపుల్లో భారీగా కోత విధించడంపై జీవన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం కేంద్రీయ విద్యాలయానికి 5 ఎకరాలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం 2 ఎకరాలే ఎందుకు కేటాయించారని ప్రశ్నించారు. అలాగే, యంగ్ ఇండియా స్కూల్‌కు 20 ఎకరాలు ఇవ్వాల్సి ఉంటే, దాన్ని 10 ఎకరాలకే ఎందుకు పరిమితం చేశారని నిలదీశారు. స్థలాన్ని సగానికి సగం కుదించడంలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ పాత్ర ఏమిటని, పూర్తి స్థాయిలో స్థలాన్ని ఎందుకు కేటాయించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 10 ఎకరాలు తెచ్చి దానికి పాలాభిషేకాలు చేసుకోవడం ఏంటని ఎమ్మెల్యే తీరును ఎండగట్టారు.

రూ.20 వేల కోట్ల కాంట్రాక్టుల వెనుక ఎవరు?

Advertisement

రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణాల వెనుక పెద్ద ఎత్తున అవినీతి దాగి ఉందనే అనుమానాలను జీవన్ రెడ్డి వ్యక్తంచేశారు. ఒక్కో పాఠశాల నిర్మాణానికి రూ. 200 కోట్లు ఖర్చు చేస్తున్నారని, మొత్తం 100 పాఠశాలలకు కలిపి రూ. 20 వేల కోట్ల భారీ వ్యయం జరుగుతోందని వెల్లడించారు. ఇంత పెద్ద మొత్తంలో జరుగుతున్న నిర్మాణ పనులను స్థానిక కాంట్రాక్టర్లను పక్కనబెట్టి, మేఘా కృష్ణారెడ్డికి ఎందుకు కట్టబెడుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కాంట్రాక్టుల కేటాయింపు వల్ల స్థానిక కాంట్రాక్టర్లకు తీవ్ర అన్యాయం జరుగుతోందని జీవన్ రెడ్డి ఆరోపించారు.

Also Read: ఏపీలో ఆ ఒక్క‌టీ అడ‌క్కు…! అన్నింటా పొదుపు చ‌ర్య‌లు.. కానీ జ‌నాభాను మాత్రం పెంచుతారు..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×