// // Rome: ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి ప్రధాని మోదీ అరుదైన గిఫ్ట్, వీడియో వైరల్ -->
E-Paper
Advertisement

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి ప్రధాని మోదీ అరుదైన గిఫ్ట్, వీడియో వైరల్

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి ప్రధాని మోదీ అరుదైన గిఫ్ట్, వీడియో వైరల్
Advertisement

Rome: విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ ఇటలీకి చేరుకున్నారు. ఆయనకు ఆ దేశ ప్రధాని జార్జియా ఘన స్వాగతం పలికారు. భారత్‌- ఇటలీ సంబంధాల బలోపేతంపై ఇరువురి నేతల మధ్య చర్చలు జరగనున్నాయి. ఇదే సమయంలో మోదీ-మెలోనీల ఆత్మీయ పలకరింపులకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

ఇటలీలో ప్రధాని నరేంద్రమోదీకి ఘన స్వాగతం

Advertisement

ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉదయం ఇటలీ రాజధాని రోమ్‌కు చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ఆయనకు ఇటలీ ప్రధాని ఘన స్వాగతం పలికారు. అక్కడి నేరుగా బస చేసే హోటల్‌కి వెళ్లారు. ప్రధాని మోదీ రాక తెలుసుకున్న రోమ్‌లోని భారతీయులు తరలివచ్చారు. ప్రధాని మోదీ వారిని కలుసుకుని ఆప్యాయంగా ముచ్చటించారు.

దౌత్య చర్చల కోసం రోమ్‌కు చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీతో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ సమావేశమయ్యారు. ఆ తర్వాత ప్రధాని మోదీకి ఆమె విందు ఇచ్చారు. అనంతరం ఇరువురు నేతలు ప్రతిష్టాత్మక కొలెసియంను సందర్శించారు. అంతేకాదు నేతలిద్దరూ సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫొటోను ఇటలీ ప్రధాని మెలోనీ ఎక్స్‌ ద్వారా షేర్ చేసుకున్నారు.

Advertisement

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి  అరుదైన గిఫ్ట్ ఇచ్చిన ప్రధాని మోదీ

రోమ్‌కు స్వాగతం మిత్రమా అంటూ రాసుకొచ్చారు. ఈ ఫొటో నెట్టింట వైరల్‌ గా మారింది. అలాగే మెలోనీతో కారులో ప్రయాణం, విందు, కొలెసియంను సందర్శించిన చిత్రాలను ఎక్స్‌లో పంచుకున్నారు ప్రధాని మోదీ. భారత్‌- ఇటలీ సంబంధాల బలోపేతానికి జరగనున్న చర్చల కోసం ఎదురుచూస్తున్నానని రాసుకొచ్చారు.

ఇద్దరు నాయకుల మధ్య ఉన్నత స్థాయి సమావేశానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి మెలోడీ టాఫీ ప్యాక్‌ను బహుమతిగా ఇచ్చారు. ప్రధాని బహుమతిగా ఇచ్చిన మెలోడీ చాక్లెట్ల ప్యాక్‌ను పట్టుకున్న ప్రధాని మోదీ.. మాకు ఒక బహుమతి తెచ్చారంటూ మెలోని చెప్పడం ఆ వీడియోలో వినిపించింది.

ALSO READ: పాక్ సంచలన నిర్ణయం.. లాహోర్ వీధుల్లో హిందూ పేర్లు.. అసలేం జరుగుతోంది?

బహుమతికి ధన్యవాదాలని ఆమె క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో నెటిజన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇద్దరు నాయకుల మధ్య జరిగిన ఈ స్నేహపూర్వక సంభాషణపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×