E-Paper
Advertisement

Congress : వలస ఎమ్మెల్యేలపై ఓ కన్నేసిన కాంగ్రెస్ అధిష్టానం?

Congress : వలస ఎమ్మెల్యేలపై ఓ కన్నేసిన కాంగ్రెస్ అధిష్టానం?
Advertisement

బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల అంశం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. వారి వ్యవహారశైలిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా కొందరు వ్యవహరిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వ్యవహారంతో అధిష్టానం గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి అనంతరం.. అధికార కాంగ్రెస్ పార్టీలో మహిపాల్ రెడ్డి చేరిన విషయం తెలిసిందే. కొంతకాలంగా ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యేగా చెలామణి అయ్యారు. స్థానిక కాంగ్రెస్ నేతల నుంచి అభ్యంతరాలు, పార్టీలో సముచిత స్థానం దక్కుతుందని ఆశించినా అది వర్కౌట్ కాలేదు. దీంతో చేసేదేమీ లేక తిరిగి గులాబీకి గూటికి చేరారు.

కాంగ్రెస్‌కు దెబ్బ..

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా గూడెం మహిపాల్ రెడ్డి వ్యవహరించారు. తన అనుచరులు, తనకు మంచి పదవులు వస్తాయని కాంగ్రెస్‌లో చేరిన ఆయనకు చుక్కెదురు అయ్యింది. దీంతో పార్టీ మీద అసహనంతో తిరిగి గులాబీ పార్టీలోకి వచ్చి మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీని గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. తన కేడర్ సైతం గులాబీ కౌన్సిలర్ల గెలుపునకు కృషి చేశారు. తీరా ఫలితాలు వచ్చాక అధికారికంగా గులాబీ పార్టీలో చేరకముందే మహిపాల్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే గులాబీ అభ్యర్థుల గెలుపునకు కసరత్తు చేసినట్టు కాంగ్రెస్ అధిష్టానం గుర్తించింది. దీనికి తోడు ఆయన బుల్లెట్ దిగిందా? అని చేసిన కామెంట్స్ పొలిటికల్‌గా హీట్ పెంచాయి.

వలస ఎమ్మెల్యేల చేరికతో రచ్చ..

Advertisement

బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిన ఎమ్మెల్యేలు మొత్తం 10 మంది. అందులో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరారు. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ విచారణ సమయంలోనూ ఆయన తాను బీఆర్ఎస్‌లోనే ప్రకటించారు.తాజాగా ఇటీవల సొంతగూటికి వచ్చారు. కానీ, మిగతా ఎమ్మెల్యేలు సైతం తాము బీఆర్ఎస్‌లోనే ఉన్నామని స్పీకర్‌కు గడ్డం ప్రసాద్ కుమార్‌‌కు స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే, అధికార పార్టీలో స్థానిక సీనియర్లతో వారికి పడటం లేదని ప్రచారం జరుగుతోంది. జగిత్యాల జిల్లాలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి.. కాంగ్రెస్‌లో చేరిన వలస ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు అసలు పడటం లేదు. సంజయ్‌కు ప్రయారిటీ ఇస్తూ తనను పట్టించుకోవడం లేదని, మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆయనకే అధిక టికెట్లు ఇచ్చారని బహిరంగ విమర్శలు చేశారు.

CM Revanth Reddy: బిగ్ టీవీ చైర్మన్ విజయ్‌కాంత్ రెడ్డిని పరామర్శించిన ముఖ్యమంత్రి.. వెన్నం కుటుంబానికి ప్రగాఢ సానుభూతి

Advertisement

క్రమంగా ఈ ఇష్యూ పెద్దది అయ్యేలా ఉంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మీద అనర్హత అంశంపై విచారణ పూర్తవ్వగా.. స్పీకర్ తుది నిర్ణయం ఇంకా వెల్లడించలేదు.వీరిద్దరికి స్పీకర్ క్లీన్ చిట్ ఇస్తారా? లేదా వేటు వేస్తారా? అనేది తెలియాల్సి ఉన్నది. మరోవైపు ఇతర వలస ఎమ్మెల్యేలకు స్థానిక కాంగ్రెస్ సీనియర్లతో పోరు పడటం లేదని తెలుస్తున్నది.ఈ క్రమంలోనే వారంతా తిరిగి సొంతగూటికి వెళదామా? ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.దీనికి తోడు కొందరు గుట్టుగా బీఆర్ఎస్ పార్టీతో టచ్‌లోకి వెళ్లడంతో పాటు ఇక్కడి ముచ్చట్లు అక్కడ చెబుతున్నట్టు అధికార పార్టీకి సమాచారం అందినట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే వలస ఎమ్మెల్యేలపై అధిష్టానం ఓ కన్నేసినట్టు తెలుస్తున్నది. ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినట్టు తెలిస్తే వారిని వెంటనే సస్పెండ్ చేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×