E-Paper
Advertisement

CM Revanth Reddy: బిగ్ టీవీ చైర్మన్ విజయ్‌కాంత్ రెడ్డిని పరామర్శించిన ముఖ్యమంత్రి, మంత్రులు

CM Revanth Reddy: బిగ్ టీవీ చైర్మన్ విజయ్‌కాంత్ రెడ్డిని పరామర్శించిన ముఖ్యమంత్రి, మంత్రులు
Advertisement

CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం మహబూబాబాద్ జిల్లా రెడ్యాల గ్రామంలో పర్యటించి బిగ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానెల్స్ చైర్మన్ వెన్నం విజయ్‌కాంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వెన్నం శ్రీకాంత్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వారి తండ్రి వెన్నం రాఘవేందర్ రెడ్డి చిత్రపటానికి ముఖ్యమంత్రి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాఘవేందర్ రెడ్డి మృతి పట్ల తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. విజయ్‌కాంత్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలను ఓదార్చి ధైర్యం చెప్పారు. రాఘవేందర్ రెడ్డి మరణం ఆ కుటుంబానికే కాకుండా గ్రామానికి కూడా తీరని లోటు అని మంత్రులు పేర్కొన్నారు. ఒక సాధారణ రైతుగా ఉంటూ కుమారులను ఉన్నత స్థానాల్లో నిలబెట్టిన ఆయన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

Advertisement

విషాదంలో ఉన్న వెన్నం కుటుంబానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. పరామర్శించిన వారిలో ముఖ్యమంత్రితో పాటు కీలక మంత్రులు ఉండటంతో రెడ్యాల గ్రామంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రాఘవేందర్ రెడ్డికి నివాళులర్పించారు.

Advertisement

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×