E-Paper
Advertisement

New Secretariat : తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవం.. ఆ ఫైల్ పై కేసీఆర్ తొలి సంతకం..

New Secretariat : తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవం.. ఆ ఫైల్ పై కేసీఆర్ తొలి సంతకం..
Advertisement

New Secretariat : తెలంగాణ కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. తొలుత ప్రధాన ప్రవేశ గేటు వద్ద పూజలు నిర్వహించారు. తర్వాత ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోమశాల వద్ద యాగ పూర్ణాహుతిలో కేసీఆర్ పాల్గొన్నారు. అక్కడి నుంచి ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని సచివాలయాన్ని ప్రారంభించారు.

సచివాలయంలో శిలాఫలకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. తూర్పుగేటు నుంచి సచివాలయంలోనికి వెళ్లారు. బ్యాటరీ కారులో తిరుగుతూ సచివాలయాన్ని పరిశీలించారు. అనంతరం అనంతరం కొత్త సచివాలయం ఆరో అంతస్తులోని తన ఛాంబరుకు చేరుకున్నారు. తన ఛాంబర్ లో కేసీఆర్ పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు.

Advertisement

కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ ఫైల్ పై సీఎం కేసీఆర్ తొలి సంతకం చేశారు. మొత్తం 6 ఫైళ్లపై సీఎం సంతకాలు చేశారు. యాద్రాది కాఫీ టేబుల్ బుక్ ను ఆవిష్కరించారు. పలువురు మంత్రులు, పార్టీ నేతలు కేసీఆర్ కు పుష్పగుచ్ఛాలు అందించి కాళ్లకు దండం పెట్టారు.

మరోవైపు మంత్రులు కూడా ముహూర్త సమయంలో తమ ఛాంబర్లలోకి ప్రవేశించారు. మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్‌ నిర్ణయించిన సమయానికి తమ సీట్లలో ఆసీనులయ్యారు.  వివిధ దస్త్రాలపై సంతకాలు చేశారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×