E-Paper
Advertisement

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!
Advertisement

Tree Felling: స్వేచ్చ బ్యూరో: దౌల్తాబాద్ మండల పరిధిలోని ముత్యంపేట గ్రామంలో చెరువు భూమిలో తుమ్మ చెట్ల నరికివేత వ్యవహారం వివాదాస్పదంగా మారింది. గ్రామ సర్పంచ్ తొడంగి సునీత ఎలాంటి అనుమతులు లేకుండా చెరువులోని తుమ్మ చెట్లను నరికి అక్రమాలకు పాల్పడ్డారని వార్డు సభ్యురాలు జంగం నవనీత ఆరోపించారు. దౌల్తాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ చెట్ల నరికివేతపై ప్రశ్నించిన తమపై సర్పంచ్, ఆయన కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. బుధవారం బాధితులు విలేకరులతో మాట్లాడుతూ గ్రామంలోని ఒక చెరువులో ఆరు తుమ్మ చెట్లను నరికేందుకు మాత్రమే సంబంధిత అధికారుల అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారని, అయితే వేరే చెరువులో సుమారు వందకు పైగా తుమ్మ చెట్లను నరికి తరలించారని ఆరోపించారు.

ప్రశ్నిస్తే బెదిరింపులు..

గ్రామ ప్రజల ఆస్తిగా ఉన్న చెరువులో భారీ ఎత్తున చెట్ల నరికివేత జరిగినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు. చెట్ల నరికివేతపై గ్రామస్థులు ప్రశ్నించగా, సర్పంచ్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మాట్లాడుకుందాం అంటూ పిలిచి అక్కడ తమపై దాడి చేశారని వార్డు సభ్యురాలు జంగం నవనీత తెలిపారు. ప్రజాప్రతినిధిగా గ్రామ ఆస్తుల పరిరక్షణ గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సింది పోయి దాడులకు దిగడం బాధాకరమన్నారు. అంతేకాకుండా ఘటన సమయంలో తమ సెల్‌ఫోన్లను లాక్కొని వీడియోలు, ఫొటోలు తీయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. సర్పంచ్ భర్తతో కలిసి తమను బెదిరింపులకు గురిచేస్తున్నారని, గ్రామంలో ఎవరు ప్రశ్నించినా కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారని వాపోయారు.

Advertisement

Also Read: బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

అటవీ శాఖ అధికారులు..

ఇక చెట్ల నరికివేతపై అభ్యంతరం వ్యక్తం చేసిన యువకులపైనే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదులు చేసి ఒత్తిడి తీసుకువస్తున్నారని బాధితులు ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే హక్కును కాలరాస్తూ తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత ఇరిగేషన్,రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి చెట్ల నరికివేతకు సంబంధించిన అనుమతులు, నరికిన చెట్ల సంఖ్య, వాటి తరలింపు వివరాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. అలాగే తమపై జరిగిన దాడి ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు నిర్వహించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జంగం స్వామి,తొడంగి స్వామి,తొడంగి రాజు,తొడంగి ఆంజనేయులు,గడ్డమీది రమేష్, జంగం బాలయ్య ,గడ్డమీది శ్రీకాంత్ పంచం శ్రీను ,జంగం ముత్యం తొడంగి అనిల్, ముత్యాల రాజయ్య తదితరులున్నారు.

Advertisement

Also Read: Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×