E-Paper
Advertisement

HYDRAA: మియాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. రూ. 3,000 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం

HYDRAA: మియాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. రూ. 3,000 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం
Advertisement

HYDRAA: హైదరాబాద్‌లో కబ్జాదారుల పీడకల ‘హైడ్రా’ మరోసారి విరుచుకుపడింది. మియాపూర్ వేదికగా భారీ ఆపరేషన్ చేపట్టిన హైడ్రా అధికారులు.. సుమారు 3 వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల చెర నుంచి విడిపించారు.

మియాపూర్ మక్తా మహబూబ్‌పేటలోని సర్వే నంబర్ 44లో ఈ భారీ ఆపరేషన్ కొనసాగింది. గతంలో ప్రజావాణికి అందిన ఫిర్యాదుల మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. తప్పుడు పత్రాలు సృష్టించి సుమారు 43 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు జరిగిన కుట్రను హైడ్రా భగ్నం చేసింది. ఇప్పటికే అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో సబ్ రిజిస్ట్రార్‌పై సస్పెన్షన్ వేటు పడగా.. తాజాగా 15 ఎకరాల భూమిని హైడ్రా తన ఆధీనంలోకి తీసుకుంది.

Advertisement

గతంలోనే ఇదే ప్రాంతంలో 5 ఎకరాలను స్వాధీనం చేసుకున్న అధికారులు.. తాజాగా మరో 15 ఎకరాలకు ఫెన్సింగ్ వేసి హైడ్రా బోర్డులను ఏర్పాటు చేశారు. సర్వే నంబర్ 159 పత్రాలతో సర్వే నంబర్ 44లోని భూమిని కబ్జా చేసిన ఇమ్రాన్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. చెరువు కట్టలపై వెలిసిన అక్రమ షెట్టర్లను సైతం నేలమట్టం చేసి.. ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో హైడ్రా రాజీపడబోదని మరోసారి నిరూపించింది.

ALSO READ: గాలిపటం ఎగరవేస్తుండగా కరెంట్ షాక్.. ఐదేళ్ల బాలుడు మృతి

Advertisement

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×