E-Paper
Advertisement

Benefits of Warm Water: రోజంతా శరీరం ఉత్సాహంగా ఉండాలంటే.. నిద్రలేవగానే ఈ ఒక్క పనిచేస్తే చాలు!

Benefits of Warm Water: రోజంతా శరీరం ఉత్సాహంగా ఉండాలంటే.. నిద్రలేవగానే ఈ ఒక్క పనిచేస్తే చాలు!
Advertisement

Benefits of Warm Water: సీజన్‌తో సంబంధం లేకుండా అన్ని కాలాల్లోనూ మన శరీరానికి మేలు చేసే పానీయం ఏదైనా ఉందంటే.. గోరువెచ్చని నీళ్లు మాత్రమే. ముఖ్యంగా శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతాయి కాబట్టి.. బయట చలి తీవ్రత పెరిగే కొద్దీ మనకు అంతగా మంచినీళ్లు తాగాలి అనిపించదు. దీంతో చాలామంది శరీరానికి తగినంత నీళ్లు అందించడం లేదు. ఈ క్రమంలో వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే.. ఉదయం నిద్ర లేచిన వెంటనే గోరువెచ్చని నీటితో మీ రోజును మొదలుపెడితే.. ఆ రోజు మొత్తం ఎంతో ఉత్సాహంగా ఉండొచ్చని చెబుతున్నారు.

ఎన్నో సమస్యలకు పరిష్కారం:

గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరంలోని అంతర్గత ఉష్ణోగ్రత సంతులనం అవుతుంది. దీంతో శరీర ఉష్ణోగ్రత పెరగడమే కాకుండా.. రక్తప్రసరణ కూడా సజావుగా సాగుతుంది. ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై ఇది అద్భుతమైన ప్రభావం చూపిస్తుంది. రోజూ కొద్దికొద్దిగా వేడి నీరు తాగితే గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు నెమ్మదిగా తగ్గిపోతాయంటున్నారు నిపుణులు.

వ్యర్థాలు బయటికి పోతాయి:

Advertisement

మన రోజువారీ ఆహారం వల్ల శరీరంలో పేరుకుపోయే టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో గోరువెచ్చని నీరు ఎంతగానో సహాయపడుతుంది. కిడ్నీలు, కాలేయం సక్రమంగా పనిచేయడానికి ఇది తోడ్పడుతుంది. అలాగే చలికాలంలో ఎక్కువగా బాధించే కీళ్ల నొప్పులు, కండరాల గట్టిపడటం వంటి సమస్యలకు కూడా వేడి నీరు కొంత ఉపశమనం కలిగిస్తుంది. అలాగే గొంతు నొప్పి, దగ్గు లేదా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు గోరువెచ్చని నీరు తాగితే తక్షణ ఊరట లభిస్తుంది.

నిద్రలేవగానే తాగాలి:

శీతాకాలంలో చలిగా ఉందని నీరు తాగకపోవడం చాలా పెద్ద తప్పు. దాహం లేకపోయినా శరీరం హైడ్రేటెడ్‌గా ఉండాలి. సాధారణంగా ఒక వ్యక్తి రోజుకు సుమారు 2 నుంచి 3 లీటర్ల నీటిని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది వయసు, బరువు, పనిచేసే శ్రమను బట్టి మారుతుంది. అలాగే నీటిని ఒక్కసారిగా ఎక్కువగా తాగడం కంటే.. రోజంతా కొద్దికొద్దిగా తాగడం చాలా మంచిది. ముఖ్యంగా ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో ఒకటి లేదా రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు తాగితే శరీరం తేలిగ్గా అనిపిస్తుంది.

ఆ పొరపాట్లు చేయొద్దు:

Advertisement

వేడి నీరు తాగడంతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా అవసరం అంటున్నారు నిపుణులు. చలికాలంలో ఎక్కువగా టీ, కాఫీలు తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కెఫిన్ ఎక్కువగా ఉన్న పానీయాలను తగ్గించి, వాటి స్థానంలో హెర్బల్ టీ లేదా సాధారణ గోరువెచ్చని నీటిని తీసుకోవడం ఉత్తమం. అలాగే రోజూ అరగంట నడక లేదా వ్యాయామం చేయడం, సరైన సమయానికి నిద్రపోవడం, నిద్రలేవడం వంటి అలవాట్లు కూడా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

 

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×