E-Paper
Advertisement

CM Revanth Reddy: సీఎం సోదరుడి ఇంటి కూల్చివేతపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్లారిటీ!

CM Revanth Reddy: సీఎం సోదరుడి ఇంటి కూల్చివేతపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్లారిటీ!
Advertisement

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి సంబంధించిన ఇల్లు కూల్చివేత విషయంలో జరుగుతున్న ప్రచారంపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వివరణ ఇచ్చారు. దుర్గం చెరువు పరిసర ప్రాంతంలో ఉన్న ఈ ఇంటిని తిరుపతి రెడ్డి చాలా ఏళ్ల క్రితం కొనుగోలు చేశారు. అయితే.. ఈ ఇల్లు ఫుల్ ట్యాంక్ లెవెల్ (FTL), బఫర్ జోన్ పరిధిలో ఉందా..? లేదా..? అనే అంశంపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక విషయాలు వెల్లడించారు.

రంగనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రాంతంలో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిని నిర్ధారించేందుకు 2008లోనే అడ్వొకేట్ కమిషన్‌ను ఏర్పాటు చేశారని అన్నారు.. ఈ కమిషన్ విచారణ ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు ఈ ప్రాంతంలో వేలాది మందికి నోటీసులు అందజేశారు. ఆ నోటీసులు అందుకున్న వారిలో సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి కూడా ఒకరు. వేలాది మందికి నోటీసులు వెళ్లినప్పటికీ.. కేవలం తిరుపతి రెడ్డి ఇంటిపైనే దృష్టి సారించి అనవసర ప్రచారం జరుగుతోందని కమిషనర్ స్పష్టం చేశారు.

Advertisement

కొంతకాలంగా ఈ ఇల్లు కూల్చివేత అంశం స్థానికంగా చర్చనీయాంశమైంది. ‘పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారు.. కానీ సీఎం సోదరుడి ఇల్లు ఎందుకు కూల్చడం లేదు?’ అంటూ కొందరు ప్రశ్నించడం మొదలుపెట్టారు. దీనిపై స్పందించిన కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక విషయాలు చెప్పారు.. అసలు విషయం ఏంటంటే… ఆ స్థలం FTL, బఫర్ జోన్లలో ఉందా లేదా అనేది న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశం అని.. ఈ విషయంలో హైకోర్టు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తేల్చి చెప్పారు.

ఈ ఇష్యూని కావాలని తప్పుదోవ పట్టించేందుకు.. అనవసరంగా రాంగ్ ట్రాక్‌లోకి తీసుకువెళ్లేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు. న్యాయపరమైన చిక్కులు ఉన్నందున కోర్టు ఆదేశాల మేరకు తప్ప, మరే ఇతర కారణాల వల్ల కూల్చివేత ఆలస్యం కావడం లేదని ఆయన స్పష్టం చేశారు. పేద, ధనిక అనే తేడా లేకుండా.. కోర్టు ఆదేశాలకు లోబడి మాత్రమే చర్యలు ఉంటాయని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు.

Advertisement

ALSO READ: Temba Bavuma: 2007 వ‌ర‌ల్డ్ క‌ప్ లో రోహిత్ శర్మ ఆడేసరికి, నేను స్కూల్ కు వెళుతున్నా

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×