// // Hyderabad Traffic: హైదరాబాద్ సిటీ వాసులకు అలర్ట్.. ఆ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు, ఎందుకంటే -->
E-Paper
Advertisement

Hyderabad Traffic: హైదరాబాద్ సిటీ వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఆ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు, ఎందుకంటే

Hyderabad Traffic: హైదరాబాద్ సిటీ వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఆ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు, ఎందుకంటే
Advertisement

Hyderabad Traffic: హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ట్రాఫిక్ పోలీసులు. ఐపీఎల్ మ్యాచ్‌ల్లో భాగంగా ఉప్పల్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

హైదరాబాద్ సిటీ వాహనదారులకు అలర్ట్

Advertisement

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. దీంతో సిటీ వాసులకు బిగ్ అలర్ట్ చేశారు ట్రాఫిక్ పోలీసులు. ఈ నేపథ్యంలో స్టేడియం పరిధి, పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. స్టేడియం చుట్టూ ట్రాఫిక్ డైవర్షన్ అమలు చేస్తున్నారు.

క్రికెట్ మ్యాచ్ జరిగే రోజుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉండడంతో ఆయా రోజుల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. ఐపీఎల్-2026 సీజన్‌లో ఏప్రిల్ 5 నుంచి మే 22 వరకు 7 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇప్పటికే ఓ మ్యాచ్ జరిగింది. మరో ఆరు మ్యాచ్ లు మెలిగి వున్నాయి. ఏప్రిల్ 13న అంటే సోమవారం మరో మ్యాచ్ జరగనుంది.

Advertisement

ఐపీఎల్ మ్యాచ్‌ నేపథ్యంలో ఆ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఇవాళ 1 మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఉప్పల్ జంక్షన్ వైపు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు ట్రాఫిక్ పోలీసులు. ముఖ్యంగా వరంగల్-హైదరాబాద్ మధ్య భారీ వాహనాలు ఘట్‌కేసర్ వద్ద ఓఆర్ఆర్ ఎంట్రీ కావాలని సూచించారు పోలీసులు.

ఏప్రిల్ 13, 18, 21, మే 3, 6, 22 తేదీల్లో ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. అర్థరాత్రి వరకు నాగోల్-హబ్సిగూడ, బోడుప్పల్-అంబర్‌పేట ప్రాంతాల మధ్య ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండనుంది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు ప్రధానంగా సూచన చేశారు.

ALSO READ: బీఆర్ఎస్ చెమటలు పట్టిస్తున్న కవిత.. రంగంలోకి దిగిన కేసీఆర్, ఆపై ప్రకటన

స్టేడియం సమీపంలో నాలుగు పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. పాస్ ఉన్నవారి వాహనాలకు స్టేడియం లోపల పార్కింగ్‌కు అనుమతి ఉంటుందన్నారు. ఘట్‌కేసర్ వైపు నుంచి వచ్చే వాహనాలను మెహిఫిల్ హోటల్ మీదుగా హెచ్‌ఎండీఏ భగాయత్ వద్ద నాగోల్, ఎల్‌బీనగర్ వైపు మళ్లించనున్నారు. ఎల్బీ‌నగర్ నుంచి ఉప్పల్ వచ్చే వాహనాలను నాగోల్ మెట్రో వద్ద యూటర్న్ తీసుకుని బోడుప్పల్-చెంగిచర్ల మార్గం వైపు మళ్లించనున్నారు.

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×