E-Paper
Advertisement

హైదరాబాద్‌లో మరో స్టీల్ ఫ్లైఓవర్ ఓపెనింగ్.. ఆ రూట్లో ఇక ట్రాఫిక్ మాయం

హైదరాబాద్‌లో మరో స్టీల్ ఫ్లైఓవర్ ఓపెనింగ్.. ఆ రూట్లో ఇక ట్రాఫిక్ మాయం
Advertisement

Steel Flyover: స్వేచ్ఛ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజురోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు సర్కారు హెచ్ సిటీ కింద నిర్మిస్తున్న ఒక్కో ప్రాజెక్టు క్రమంగా ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రాంతాల వారీగా వాహనదారులకు ట్రాఫిక్ సమస్య నుంచి కొంత ఉపశమనం కల్గుతుంది. నిత్యం రద్దీగా ఉండే నల్గొండ క్రాస్ రోడ్డు నుంచి కంచన్ బాగ్ ఓవైసీ హాస్పిటల్ వరకు దశాబ్దాల క్రితం ప్రతిపాదించిన స్టీల్ బ్రిడ్జి పనులు ముగిసి, బ్రిడ్జి ప్రారంభానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. సుమారు రూ. 630 కోట్ల వ్యయంతో మొత్తం 3.32 కిలోమీటర్ల పొడువున ఆరు లేన్లుగా నిర్మించిన ఈ స్టీల్ ఫ్లై ఓవర్ క్షేత్ర స్థాయిలో అనేక రకాల అడ్డంకులను అధిగమించి, ఎట్టకేలకు నిర్మాణం పూర్తి చేసుకుంది.

వచ్చే నెల 2వ తేదీన..

ముఖ్యంగా ఐఎస్ సదన్‌‌ల ఉన్న ఓ దేవాలయం, మరో ప్రార్థన మందిరాలకు ఎఫెక్టు చేసేలా ఈ వంతెనను నిర్మిస్తున్నారంటూ స్థానికులు తీవ్ర స్థాయిలో అభ్యంతరాలను వ్యక్తం చేయటంతో పాటు పలు సార్లు ఆందోళనలు కూడా చేపట్టారు. దీనికి తోడు స్థల సేకరణకు కూడా అనేక రకాల అడ్డంకులు ఏర్పడినా, అధికారులు ఎంతో వ్యూహాత్మకంగా వాటిని అధిగమించి, ఈ వంతెన పనులను ముందుకు తీసుకెళ్లారు. కొద్ది రోజుల క్రితం కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఈ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించి, నిర్ణీత గడువులోపే నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ వంతెనను వచ్చే నెల 2వ తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జీహెచ్ఎంసీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.

Advertisement

Also Read: సీఎం రేవంత్ రెడ్డి గ్రామంలో ఐదు ఎకరాల ఏటీసీ సెంటర్..!

నల్గొండ క్రాస్ రోడ్డు నుంచి..

ఓవైసీ హాస్పిటల్ వరకు సుమారు 210 మీటర్ల పొడువున అప్ ర్యాంప్‌ను నిర్మించగా, అక్బర్ బాగ్ వద్ద డౌన్ ర్యాంప్‌ను కూడా నిర్మించారు. ఈ స్టీల్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే నల్గొండ క్రాస్ రోడ్డు నుంచి కంచన్ బాగ్ ఓవైసీ హాస్పిటల్ వరకు ఇక రాకపోకలు వేగంగా ముందుకు కదలనున్నాయి. ప్రస్తుతం చాంద్రాయణగుట్ట, సైదాబాద్, కంచన్ బాగ్‌లో నెలకొన్న ట్రాఫిక్ తగ్గుముఖం పట్టి, వాహానాలు వేగంగా ముందుకు సాగేందుకు వీలు కల్గడంతో పాటు సగ్నల్ ఫ్రీ ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఈ స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఓల్ట్ సిటీ, న్యూ సిటీల మధ్యనే గాక, న్యూ సిటీ నుంచి పలు శివారు ప్రాంతాలకు కూడా రాకపోకలు మరింత పెరిగే అవకాశాలున్నాయి.

Advertisement

Also Read: Supreme Court: కులగణన వ్యవహారం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఆపై కీలక వ్యాఖ్యలు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×