E-Paper
Advertisement

కండోమ్ చూసి షాకైన ఆ ప్రియుడు.. ఆపై మత్తు విరిగిపోయింది

కండోమ్ చూసి షాకైన ఆ ప్రియుడు.. ఆపై మత్తు విరిగిపోయింది
Advertisement

Siddipet: కూల్‌ డ్రింక్స్, మద్యం బాటిళ్లలో రకరకాల పురుగులు, చెత్త కనిపించడం పేరు విన్నాము.. చూస్తున్నాము. కాకపోతే  ఓ మద్యం ప్రియుడికి బీరు బాటిల్‌తోపాటు కండోమ్ ప్యాకెట్ కనిపించడంతో తాగిన మత్తు అంతా వదిలేసింది. ఎక్కడ.. ఎప్పుడు? ఎలా జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

సిద్ధిపేట్ జిల్లాలో ఓ మద్యం ప్రియుడికి ఊహించని షాక్

Advertisement

సిద్దిపేట జిల్లా భూంపల్లి ప్రాంతంలోని లక్ష్మీ నరసింహ వైన్ షాపులో కింగ్‌ఫిషర్ బీర్లు కొనుగోలు చేశాడు ఓ వ్యక్తి. అసలే ఎండాకాలం.. కనీసం బీరు తాడితే శరీరం కూల్ గా ఉంటుందని, ఆపై నిద్ర పడుతుందని భావించాడు. ఈ క్రమంలో ఇంటికి వెళ్లి కొన్ని బీర్లు బాటిళ్లను తీసుకెళ్లాడు. ఒక బాటిల్ తాగిన తర్వాత మరో బాటిల్‌ను చూశాడు. అందులో కండోమ్ ప్యాకెట్ దర్శనమీయడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు.

అంతేకాదు తాగిన మత్తు దెబ్బకు వదిలేసింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ బాటిల్‌ను వైన్ షాపు వద్దకు తీసుకెళ్లి సిబ్బందిని ప్రశ్నించాడు. ఆ షాపులోని సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో మరింత ఆగ్రహానికి లోనయ్యాడు సదరు మద్యం ప్రియుడు.

Advertisement

బీరు బాటిళ్లలో కండోమ్స్..  ఆపై మత్తు విరిగిపోయింది

పరిస్థితి గమనించిన ఆ వ్యక్తి నేరుగా స్థానిక ఎక్సైజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఎక్సైజ్ అధికారులు, విచారణ మొదలుపెట్టారు. సీల్డ్ బాటిల్‌లోకి కండోమ్ ప్యాకెట్ ఎలా వచ్చింది? తయారీ సమయంలో జరిగిన సమస్యా? కావాలనే ఎవరైనా ఈ చర్యకు పాల్పడ్డారా? అనేదానిపై విచారణ చేపట్టారు.

ఈ వ్యవహారానికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై మద్యం ప్రియులు తమదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు. నాణ్యతా ప్రమాణాలను గాలికి వదిలేస్తున్నారని ఆరోపించారు. తయారీ దారులు ఆ సమయంలో మత్తులో ఉన్నారా? అంటూ ప్రశ్నించేవాళ్లు లేకపోలేదు. మరి అధికారుల విచారణలో ఏ తేలుతుందో చూడాలి.

ALSO READ: మా ఇల్లే కదా.. నన్ను ఎవరు చూడరు అని అలా చేస్తున్నారా.. అయితే మీ పని ఖతం..?

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×