E-Paper
Advertisement

10వ అంతస్తు నుంచి దూకి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సూసైడ్!

10వ అంతస్తు నుంచి దూకి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సూసైడ్!
Advertisement

Hyderabad Suicide: హైదరాబాద్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఏ కష్టం వచ్చిందో ఏమో తెలియదు కానీ, ఐటీ ఉద్యోగం చేస్తూ సమాజంలో మంచి స్థాయిలో ఉన్న ఒక యువకుడు అర్ధాంతరంగా నూరేళ్ల ఆయుష్షును ముగించేశాడు. ఈ హృదయ విదారక ఘటన నగరంలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో వెలుగుచూసింది.

స్థానికుల వివరాల ప్రకారం.. విష్ణువర్ధన్‌రెడ్డి (24) అనే యువకుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఏం జరిగిందో ఏమో గానీ, పుప్పాలగూడలోని ఒక అపార్ట్‌మెంట్ పదో అంతస్తు పైనుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఊహించని ఈ ఘటనతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. రక్తపు మడుగులో పడివున్న విష్ణువర్ధన్‌ను చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విష్ణువర్ధన్‌రెడ్డి ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలేమిటి? పని ఒత్తిడా లేక వ్యక్తిగత సమస్యలేమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: మానవత్వం చాటుకున్న కోమటిరెడ్డి.. ఐఐటీ విద్యార్థినికి రూ. 10 లక్షల సాయం!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×