E-Paper
Advertisement

RRR Project: ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టుకు కేద్రం బ్రేక్.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడెలా..?

RRR Project: ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టుకు కేద్రం బ్రేక్.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడెలా..?
Advertisement

RRR Project: స్వుచ్ఛ బ్యూరో: హైదరాబాద్ చుట్టూ ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన రీజినల్ రింగ్ రోడ్(ట్రిపుల్ ఆర్) ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారీ వ్యయాన్ని తగ్గించే క్రమంలో ఈ ప్రాజెక్టును ఎక్స్‌ప్రెస్‌ వే జాబితా నుంచి తొలగించి, సాధారణ జాతీయ రహదారి స్థాయికి కుదించినట్లు సమాచారం. గతంలో దీనిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఎక్స్‌ప్రెస్‌వేగా భావించారు. అయితే, సుమారు రూ.38,000 కోట్ల వ్యయాన్ని భరించడం కష్టమని భావించిన కేంద్రం, ప్రాజెక్టు డిజైన్లలో మార్పులు చేసి ఖర్చును 25 శాతం మేర తగ్గించాలని నిర్ణయించింది.

Also read: Arunachalam Laddu: అరుణాచలంలో ఆగని ప్రసాద కష్టాలు.. గ్యాస్ కొరతతో లడ్డూ తయారీకి బ్రేక్

Advertisement

50 శాతం తగ్గింపు..

గతంలో 8 లేన్లుగా ప్రతిపాదించిన ఈ రహదారిని ఇప్పుడు 6 లేన్లకు పరిమితం చేశారు. వేగ పరిమితిని కూడా గంటకు 120 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్లకు తగ్గించారు. ఖర్చు తగ్గించేందుకు సర్వీస్ రోడ్ల ప్రతిపాదనను పూర్తిగా తొలగించారు. వంతెనలు, అండర్ పాస్‌, ఇంటర్‌ఛేంజ్‌ల సంఖ్యను దాదాపు 50 శాతం మేర తగ్గించారు. ఉదాహరణకు, ఉత్తర భాగంలో ప్రతిపాదించిన 200 వంతెనల సంఖ్య ఈ నిర్ణయంతో సగానికి తగ్గడం గమనార్హం. వీధి దీపాలను కేవలం జనావాసాలు, పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేయనున్నారు. ఔటర్ రింగ్ రోడ్ కంటే మెరుగైన సౌకర్యాలతో 362 కిలోమీటర్ల పొడవైన భారీ ప్రాజెక్టుగా ఇది నిలుస్తుందని ఆశించినప్పటికీ, తాజా మార్పుల వల్ల దీని సామర్థ్యం తగ్గనుంది. సర్వీస్ రోడ్లు, అండర్ పాస్‌ల సంఖ్య తగ్గడం వల్ల స్థానిక రవాణాపై ప్రభావం పడే అవకాశం ఉంది.

Advertisement

Also read: No Internet Live TV: ఇంటర్నెట్ లేకున్నా ఫోన్‌లో లైవ్ టీవీ ఛానెల్స్ ఉచితంగా.. కొత్త ఫీచర్ గురూ

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×