E-Paper
Advertisement

Sahibzada Farhan: అల్లా మీద ఒట్టు..ఎప్ప‌టికైనా బుమ్రా బౌలింగ్ లో 6 బంతుల్లో 6 సిక్స‌ర్లు కొడ‌తా

Sahibzada Farhan: అల్లా మీద ఒట్టు..ఎప్ప‌టికైనా బుమ్రా బౌలింగ్ లో 6 బంతుల్లో 6 సిక్స‌ర్లు కొడ‌తా
Advertisement

Sahibzada Farhan:  పాకిస్తాన్ ఆటగాళ్లు పొద్దున లేస్తే ఇండియాను టార్గెట్ చేసి కామెంట్లు చేస్తూ ఉంటారు. ఇండియా మ్యాచ్ విజయం సాధిస్తే ఫిక్సింగ్ అంటూ ఆరోపణలు చేస్తారు. అదే ఓడిపోతే, పసికూన పైన ఓడిపోయిందని ట్రోలింగ్ కూడా చేస్తారు. అయితే ఈ నేపథ్యంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాను ఉద్దేశించి పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ ( Sahibzada Farhan ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) బౌలింగ్ లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొడతానని శ‌ప‌థం చేశారు. అల్లా మీద ఒట్టు బుమ్రా బౌలింగ్ లో క‌చ్చితంగా సిక్సులు కొట్టి తిర‌తాన‌ని వెల్ల‌డించారు ఫ‌ర్హాన్‌. దీంతో పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Also Read:  Clash in SRH: కావ్య మారన్ కు మ‌రో త‌ల‌నొప్పి.. SRH లో ప్లేయ‌ర్ల మ‌ధ్య గొడ‌వ‌..కెప్టెన్ ఇషాన్ పైనే తిరుగుబాటు

బుమ్రా బౌలింగ్ లో 6 బంతుల్లో 6 సిక్స‌ర్లు కొడ‌తా

Advertisement

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే జనాలు ఎగబడి చూస్తారు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే, ఇండియా అలాగే పాకిస్తాన్ క్రికెటర్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అయితే ఎన్నిసార్లు పాకిస్తాన్ తో తలపడినప్పటికీ కూడా ఇండియానే పై చేయి సాధించింది. అయినప్పటికీ పాకిస్తాన్ ప్లేయర్లు ఓవర్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు. రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా బుమ్రాకు సవాల్ విసిరాడు పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్. తన కెరీర్ లో కచ్చితంగా బుమ్రా బౌలింగ్ లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొడతానని శపథం చేశాడు. ఇది ఎప్పుడు జరుగుతుందో తెలియదు కానీ.. కచ్చితంగా బుమ్రా బౌలింగ్ లో ఆరు సిక్సర్లు కొట్టడం గ్యారంటీ అంటూ ప్రకటన చేశాడు సాహిబ్‌జాదా ఫర్హాన్.

ఈ సవాల్ ను బుమ్రా స్వీకరించాలని కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఫర్హాన్. దీంతో సాహిబ్‌జాదా ఫర్హాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అటు సాహిబ్‌జాదా ఫర్హాన్ చేసిన కామెంట్లపై ఇండియన్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సందర్భంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. అప్పుడు బుమ్రా బౌలింగ్ లో ఎందుకు కొట్టలేదని.. తొందరగానే ఎందుకు అవుట్ అయ్యావు అని ఫ్యాన్స్ నిలదీస్తున్నారు. బుమ్రా బౌలింగ్ లో సిక్సర్లు కొట్టాలంటే దేవుడు దిగిరావాలని చెబుతున్నారు.

బుమ్రా బౌలింగ్ లో సిక్సర్లు కొట్టిన రికార్డు అతనిదే

Advertisement

ఆసియా కప్ 2025 సందర్భంగా బుమ్రా బౌలింగ్ లో ఏకంగా మూడు సిక్సర్లు కొట్టాడు సాహిబ్‌జాదా ఫర్హాన్. అంతర్జాతీయ టి20 మ్యాచ్ లో బుమ్రా బౌలింగ్ లో సిక్సర్ కొట్టిన మొదటి పాకిస్తాన్ బ్యాటర్ గా ఈ సందర్భంగా సాహిబ్‌జాదా ఫర్హాన్ రికార్డు సృష్టించాడు. అందుకే పదే పదే బుమ్రా బౌలింగ్ లో సిక్సర్లు కొడతానని ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు సాహిబ్‌జాదా ఫర్హాన్.

Also Read: Tanveer Ahmed: ఐపీఎల్ జోలికి వెళ్లొద్దు రా..వెంట‌నే PSL షెడ్యూల్ మార్చండి, లేక‌పోతే సంక‌నాకి పోతాం

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×