E-Paper
Advertisement

Hyderabad Drunk and Drive: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ ‘కిక్’.. 2,731 మందిపై కేసులు.. పోలీసులకు చుక్కలు చూపించిన యువకుడు

Hyderabad Drunk and Drive: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ ‘కిక్’.. 2,731 మందిపై కేసులు.. పోలీసులకు చుక్కలు చూపించిన యువకుడు
Advertisement

Hyderabad Drunk and Drive: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మందుబాబులు భారీగా పట్టుబడ్డారు. అధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినా బేఖాతరు చేస్తూ, మద్యం మత్తులో వాహనాలు నడిపి వేల సంఖ్యలో అడ్డంగా బుక్కయ్యారు. నిన్న రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు మూడు కమిషనరేట్ల పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 2,731 మంది పట్టుబడ్డారు.

అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,198 మంది, సైబరాబాద్‌లో 928 మంది, మల్కాజ్‌గిరి (రాచకొండ) పరిధిలో 605 మందిపై కేసులు నమోదు చేశారు. నిందితుల వాహనాలను సీజ్ చేసిన పోలీసులు, వారికి కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

ఈ తనిఖీల్లో కొన్ని వింత ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఫుల్లుగా మందు కొట్టిన ఓ యువకుడు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. తనిఖీల్లో పట్టుబడగానే భయంతో పోలీసుల కాళ్లు పట్టుకొని వదలమని ప్రాధేయపడ్డాడు. పోలీసులు అతన్ని సముదాయించి కూర్చోబెట్టే ప్రయత్నం చేయగా.. పొంతన లేని సమాధానాలతో గందరగోళం సృష్టించాడు.

“నీ పేరేంటి? మీ నాన్న ఏం చేస్తారు?” అని పోలీసులు అడిగితే.. మొదట “నాన్న లేడు” అని చెప్పి, వెంటనే మాట మార్చి మా నాన్న చైనీస్ పని చేస్తాడు.. అంటూ అసంబద్ధంగా మాట్లాడాడు. మధ్యలో “మా అమ్మని చూడాలి” అంటూ ఏదేదో వాగాడు. బండి ఎవరిదని అడిగితే అన్నయ్యదని, తండ్రి పేరు ‘రాజేష్ తిర్వా’ అని చెప్పి, ఫోన్ నెంబర్ మాత్రం సగం చెప్పి ఆగిపోయాడు. కనీసం నిలబడలేని స్థితిలో వాహనాలు నడపడమే కాకుండా, విధుల్లో ఉన్న పోలీసులకు ఇలాంటి వారు పెద్ద సవాలుగా మారుతున్నారు.

Advertisement

Read Also: న్యూఇయర్ వేళ.. కేవలం ఐదు గంటల్లో రూ. 6 కోట్ల బిర్యానీ సేల్స్, ఇంతకీ ఎక్కడో తెలుసా?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×