E-Paper
Advertisement

Switzerland Blast: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేళ.. స్విట్జర్లాండ్‌లోని ఓ బార్‌లో భారీ పేలుడు, మృతుల సంఖ్య

Switzerland Blast: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేళ.. స్విట్జర్లాండ్‌లోని ఓ బార్‌లో భారీ పేలుడు, మృతుల సంఖ్య
Advertisement

Switzerland Blast: ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సరం వేడుకల వేళ స్విట్జర్లాండ్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. స్కీ రిసార్ట్‌ సిటీలోని క్రాన్స్మోంటానాలోని ఓ బార్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అనేక మంది మృతి చెందినట్లు అంతర్జాతీయ మీడియా ద్వారా తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అసలేం జరిగింది?

న్యూ ఇయర్ వేడుకల వేళ స్విట్జర్లాండ్‌లో విషాదం

Advertisement

Advertisement

న్యూఇయర్ సెలబ్రేషన్స్ వేళ స్విట్జర్లాండ్‌లోని ఓ బార్‌లో భారీ పేలుడు జరిగింది. నూతన సంవత్సర వేడుకల్లో ఆల్పైన్ స్కీ పట్టణంలోని క్రాన్స్ మోంటానాలోని లె కాన్స్టెలేషన్ బార్‌లో పేలుడులో చోటు చేసుకుంది. ఈ ఘటనలో అనేకమంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

భారత కాలమాన ప్రకారం.. అర్ధరాత్రి ఒంటి గంటన్నర సమయంలో ఈ పేలుడు జరిగింది. భారీగా ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అంబులెన్సులో క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

ఓ బార్‌లో భారీ పేలుడు,  పదుల సంఖ్యలో మృతులు

స్విస్ఆల్ప్స్‌ పర్వత శ్రేణుల నడుమ ఈ క్రాన్స్మోంటానా నగరం ఉంది. ఈ ప్రాంతం ప్రముఖ పర్యాటక స్థలం కూడా. ప్రతీ ఏటా డిసెంబరు-జనవరి సమయంలో ఈ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. పేలుడు జరిగిన సమయంలో బార్‌లో దాదాపు 100 మందికి పైగా ఉన్నారని అక్కడి పోలీసులు చెబుతున్నారు.

ఘటనలో కనీసం 40 మంది మరణించారని స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. సమాచారం తెలుసుకునేందుకు బాధితుల బంధువుల కోసం ప్రత్యేకంగా హాట్‌లైన్ ఏర్పాటు చేశారు అక్కడి అధికారులు. ఘటన తర్వాత ఆ ప్రాంతం పూర్తిగా మూసి వేశారు. క్రాన్స్-మోంటానాపై ప్రాంతాన్ని నో-ఫ్లై జోన్ విధించినట్టు పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.

ALSO READ:  సౌదీ దెబ్బకు దిగొచ్చిన యూఏఈ.. యెమెన్ నుంచి బలగాల ఉపసంహరణ

సెలబ్రేషన్స్ వేళ సంగీత కచేరీ నిర్వహిస్తున్నారు. ఆ సందర్భంగా బాణసంచా కాల్చడం వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని స్విస్ వార్తా సంస్థ చెబుతోంది. క్రాన్స్-మోంటానా అనేది స్విస్ రాజధాని బెర్న్ నుండి రెండు గంటల దూరంలో ఉంది. ఆల్ప్స్ పర్వతాల నడిబొడ్డున ఉన్న విలాసవంతమైన స్కీ రిసార్ట్ పట్టణం బ్రిటిష్ పర్యాటకులకు కేరాఫ్‌గా చెబుతారు.

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×