E-Paper
Advertisement

Real Estate Record Prices: హైదరాబాద్ లో ఆకాశాన్ని తాకుతున్న ధరలు.. గజం భూమి లక్షల్లో..

Real Estate Record Prices: హైదరాబాద్ లో ఆకాశాన్ని తాకుతున్న ధరలు..  గజం భూమి లక్షల్లో..
Advertisement

Real Estate Record Prices: హైదరాబాద్ నగరంలోని అత్యంత ప్రధానమైన కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ (KPHB) కాలనీలో రియల్ ఎస్టేట్ మార్కెట్ సరికొత్త రికార్డులను సృష్టించింది. ఫిబ్రవరి 27న నిర్వహించిన బహిరంగ వేలంలో భూముల ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. తెలంగాణ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ధర్మారెడ్డి కాలనీలోని ఓపెన్ ప్లాట్లు, ఫేజ్-15లోని సంపూర్ణం ఫ్లాట్లకు నిర్వహించిన ఈ వేలంలో కొనుగోలుదారులు పోటీపడి మరీ వేలం పాటలు పాడారు. ఈ మొత్తం ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి రూ.24,49,42,635 ఆదాయం లభించింది.

ధర్మారెడ్డి కాలనీలో గజం రూ.2.65 లక్షలు

ధర్మారెడ్డి కాలనీలోని ఓపెన్ ప్లాట్లకు జరిగిన వేలంలో గజం ధర గరిష్ఠంగా రూ.2,65,000 పలికింది. LIG-39 ప్లాట్ (205.55 గజాలు) ఈ రికార్డు ధరను సొంతం చేసుకోగా, దీని మొత్తం విలువ సుమారు రూ.5.44 కోట్లుగా నమోదైంది. అదేవిధంగా LIG-105 ప్లాట్ గజానికి రూ.2.41 లక్షలు పలకగా, MIG-24 ప్లాట్ గజానికి రూ.1.39 లక్షల ధర పలికింది. మొత్తం 1,199.98 గజాల విస్తీర్ణం కలిగిన ప్లాట్ల విక్రయం ద్వారా రూ.15.80 కోట్లకు పైగా ఆదాయం లభించింది. ఈ వేలంలో ప్లాట్ల సగటు ధర గజానికి రూ.1,31,725గా నమోదైంది.

సంపూర్ణం ఫ్లాట్లకు భారీ డిమాండ్..

Advertisement

మరోవైపు, కేపీహెచ్‌బీ ఫేజ్-15లోని సంపూర్ణం అపార్ట్‌మెంట్లలోని 8 ఖాళీ ఫ్లాట్లకు కూడా భారీ పోటీ ఎదురైంది. 1,400 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ ఫ్లాట్లకు హౌసింగ్ బోర్డు రూ.90 లక్షల కనీస ధర (Upset Price) నిర్ణయించగా, వేలంలో అత్యధికంగా రూ.1,10,50,000 ధర పలికింది. ముఖ్యంగా B1/807, B1/1005 నంబర్లు గల ఫ్లాట్లు ఈ గరిష్ఠ ధరను నమోదు చేశాయి. అత్యంత తక్కువగా ఒక ఫ్లాట్ రూ.96 లక్షలకు అమ్ముడైంది. ఎనిమిది ఫ్లాట్ల విక్రయం ద్వారా రూ.8.44 కోట్ల ఆదాయం సమకూరింది.

ఖజానాకు కాసుల పంట..

ఈ వేలం ప్రక్రియలో ఓపెన్ ప్లాట్ల ద్వారా వచ్చిన రూ.15.80 కోట్లు, ఫ్లాట్ల ద్వారా వచ్చిన రూ.8.44 కోట్లు, అదనంగా వసూలు చేసిన 1 శాతం వేలం ఖర్చులతో కలిపి హౌసింగ్ బోర్డుకు సుమారు రూ.24.50 కోట్ల మొత్తం ఆదాయం చేకూరింది. ఐటీ హబ్‌కు దగ్గరగా ఉండటం, మెట్రో సౌకర్యం, వాణిజ్యపరంగా అభివృద్ధి చెందిన ప్రాంతం కావడంతోనే కేపీహెచ్‌బీలో ఈ స్థాయిలో ధరలు పలుకుతున్నాయని స్థిరాస్తి నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Read Also: Telangana: రేషన్ కార్డు దారులకు శుభవార్త.. నాణ్యమైన బియ్యం సరఫరాకు రైస్ మిల్లర్ల గ్రీన్ సిగ్నల్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×