E-Paper
Advertisement

హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు సమీపంలో హైస్పీడ్ రైల్..!

హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు సమీపంలో హైస్పీడ్ రైల్..!
Advertisement

High Speed Rail: శంషాబాద్​లో హైస్పీడ్​ రైల్​ కారిడార్​ టెర్మినల్​
–నాలుగు రవాణా వ్యవస్థలతో జంక్షన్​ అబివృద్ధి
–మెట్రో దిగిన వెంటనే రైల్ ఎక్కేందుకు ప్రణాళికలు
–బహుదూర్​గూడలో 650 ఎకరాల భూ కేటాయింపు
రంగారెడ్డి బ్యూరో, స్వేచ్చ:
 దేశంలోని ప్రధాన నగరాలను కలుపుతూ ఉండే రైల్వే కారిడార్​ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. శంషాబాద్​ మండల పరిధిలోని ఔటర్​ రింగు రోడ్డు సమీపంలోనున్న బహుదూర్​ గూడ, రషీద్​ గూడ, చిన్న గొల్కొండ ప్రాంతం అనువుగా ఉంటుందని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతంలో సుమారుగా 500 ఎకరాల భూమి అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్​లో హైస్పీడ్​ రైల్​ హాబ్​ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్దంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం అత్యాధునిక హంగులతో భారతీయ రైల్వేను రూపోందించనుంది. హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-పుణె కారిడార్లలో పరుగులు పెట్టనుంది. ఈ మూడు కారీడార్లను హైదరాబాద్ కేంద్రంగా ప్రకటించింది. ఈ మేరకు శంషాబాద్ మండలం బహదూర్​గూడలోని సర్వే నంబర్లు 28, 62లలో 650 ఎకరాల భూమిని ఇప్పటికే అధికారులు గుర్తించారు.

శంషాబాద్​‌లో హైస్పీడ్​ జంక్షన్​..

గంటకు వందల కీలోమీటర్ల వేగంతో దూసుకపోయే హైస్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చూట్టింది. హైదరాబాద్​ నగరంలో ట్రాఫీక్ సమస్యలను పరిష్కారించేందుకు ప్రభుత్వం అనేక మార్గాలను ఆన్వేషిస్తుంది. అందుకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మూడు కారిడార్ల అభివృద్ధి కోసం 2026–27 బడ్జెట్​లో రూ.43,848 కోట్లతో ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రతిపాదించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం హై స్పీడ్​ రైల్లను అందుబాటులోకి తీసుకోచ్చేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించారు. ఈ మూడు మార్గాల టెర్మినల్స్ నిర్మించేందుకు ప్రణాళికలు రూపోందిస్తున్నారు. ఇందుకు అవసరమైన భూ సేకరణ కూడా దాదాపు పూర్తైనట్లు సమాచారం. బెంగుళూర్, చైన్నై, పూణే నగరాలకు దూసుకెళ్లే రైల్ హాబ్ను హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయనున్నారు. అందుకు హైస్పీడ్ జంక్షన్​కు శంషాబాద్​ కేంద్రం కానుంది.

Advertisement

Also Read: దళితుల ప్లాట్లపై దౌర్జన్యం.. ఎట్ల ఎర్రవల్లిలో అగ్రవర్ణాల అల్లర్లు!

మేట్రోకు అనుసంధానం..

హైదరాబాద్ నగరాల్లో నడిపిస్తున్న మెట్రో రైల్ను శంషాబాద్​ విమానాశ్రయం వరకు విస్తరించేందుకు ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం సిద్దం చేసింది. ఈ మెట్రో రైల్ను హైస్పీడ్ రైల్ కారిడార్ జంక్షన్​కు అనుసంధానం చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తుంది. రెండో దశ మెట్రో మార్గాలను నాగోల్ నుంచి ఎల్బీనగర్​, చంద్రాయణగుట్ట మీదుగా విమానాశ్రయం వరకు 36.8కీ.మీ వరకు విస్తీరించనున్నారు. విమానాశ్రయం నుంచి ఫ్యూచరల్​ సిటీ వరకు సుమారుగా 40కీ.మీ వరకు మరో ప్రతిపాదనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.ఈ మెట్రో విస్తీర్ణానికి హైస్పీడ్​ రైల్వే కారిడార్​ను అనుసంధానం చేయనున్నారు. శంషాబాద్‌ ఔటర్‌ రింగు రోడ్డు నుంచి సుమారు 4-5 కి.మీ. దూరంలోనే హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. రోడ్డు, రైలు, మెట్రో రైలు, విమానాశ్రయంతో కలిపి మొత్తం నాలుగు మార్గాలను కొత్తగా నిర్మించబోయే హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ జంక్షన్‌తో కలిపేందుకు ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం.

Advertisement

Also read: హైదరాబాద్‌‌లో ‘జేమ్స్ బాండ్ స్ట్రీట్’ ఉందా? ఇదిగో ఇక్కడ ఉందట, కానీ..

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×