E-Paper
Advertisement

లైక్‌ల కోసం ఆశపడి.. జీవితాన్ని నాశనం చేసుకుంటున్న యువత, ఏకంగా 456 మంది ఏం చేశారంటే..

లైక్‌ల కోసం ఆశపడి.. జీవితాన్ని నాశనం చేసుకుంటున్న యువత, ఏకంగా 456 మంది ఏం చేశారంటే..
Advertisement

Hyderabad City: సోషల్ మీడియా.. ఈ పేరు చెప్పనక్కర్లేదు. వయస్సుతో పని లేకుండా చిన్నారుల నుంచి పెద్దల వరకు అంతా దృష్టి పెట్టారు. దీని ద్వారా ఓ వైపు డబ్బులు, మరోవైపు సెలబ్రిటీ స్టేటస్. దీంతో చదువులు మానేశారు కొందరు వ్యక్తులు. తన టాలెంట్‌ని నమ్ముకోకుండా వీటి బారిన పడుతున్నారు. ఈ క్రమంలో అడ్డదారులు తొక్కుతున్నారు.. అడ్డంగా బుక్కైపోతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి అలాగే చేశాడు.

లైక్‌ల కోసం ఆశపడి..  జీవితాన్ని నాశనం చేసుకుంటున్న యువత

Advertisement

హైదరాబాద్ సిటీలో అర్ధరాత్రి మద్యం లభించే ప్రాంతాల్లో వీడియోలు తీయడం మొదలుపెట్టారు కొందరు యువకులు. ఫలానా ప్రాంతంలో వ్యభిచారం జరుగుతోందని వీడియోలను చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు. కేవలం సోషల్ మీడియాలో తమ ఫాలోవర్లను పెంచుకోవడానికి ఈ స్కెచ్ వేశారు. దీని ప్రభావం సమాజంపై పడుతుందనే కనీస ఇంగిత జ్షానం లేకుండా చేశారు.

హైదరాబాద్ సిటీకి చెందిన ఓ యువకుడు ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. తన టాలెంట్ ఉపయోగించుకుని జాబ్ కొట్టాల్సింది పోయి, సోషల్ మీడియా ద్వారా అడ్డదారులు తొక్కాడు. అద్దెకు బాయ్‌ఫ్రెండ్-లైంగిక సేవలు అంటూ కొన్ని రకాల వీడియోలు రెడీ చేసి అప్‌లోడ్ చేశాడు. ఆయా వీడియోలకు వ్యూస్, లైకులు బీభత్సంగా వచ్చాయి.

Advertisement

ఇంజనీరింగ్, డిగ్రీ స్టూడెంట్స్ ఎక్కువ.. ఏకంగా 456 మంది చిక్కారు

ఉన్నట్లుండి ఆ యువకుడ్ని సోషల్ మీడియాలో పలువురు రాత్రివేళ అధికంగా ఫాలో కావడం గమనించారు. ఆ వీడియోలు అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించేలా ఉన్నాయని అంచనా వేశారు. పక్కాగా ప్లాన్ చేసి ఆ యువకుడి ఛానల్‌పై కేసు నమోదు చేశారు. మరోవైపు నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఓ కుర్రాడు డిగ్రీ పూర్తి చేశాడు.

పోటీ పరీక్షల కోసం హైదరాబాద్ కు కోచింగ్‌ కోసం వచ్చాడు. అమీర్‌పేటలో ఓ రూమ్‌లో చదువు కోవాల్సింది పోయి రాత్రి వేళల్లో స్నేహితులతో తిరుగుతూ వీడియోలు చేయడం ప్రారంభించాడు. వాటిని ఆదరణ పెరగడంతో పాపులర్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. నగరంలో ఫలానా ప్రాంతంలో వ్యభిచారం జరుగుతోందంటూ చిత్రీకరించిన వీడియోలు పోస్టు చేసి అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు.

ALSO READ: రూటు మార్చిన బీఆర్‌ఎస్ పెద్దలు.. మండలి వద్దు అసెంబ్లీ ముద్దు అంటున్న నేతలు..!

తన టాలెంట్ ఉపయోగించుకుని జీవితంలో ఉన్నతస్థాయికి వెళ్లాల్సిన యువకులు అసభ్య పోస్టులు పెట్టి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. పోలీసులకు చిక్కుతున్నారు. అలా బుక్కైన వారిలో చాలామంది డిగ్రీ, ఇంజినీరింగ్‌ చేసిన విద్యార్థులు ఉండడం తీవ్ర కలకలం రేపుతోంది. విచారణకు పిలిచినప్పుడు సోషల్‌ మీడియాలో లైక్స్‌ కోసమే చేశామని, ఈ పని చేయడం తెలీదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

లైక్స్‌ కోసం తొందరగా పాపులర్‌ కావాలనే ఇలా చేసినట్లు చెబుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు నాలుగు పోలీసు కమిషనరేట్ల పరిధిలో దాదాపు 450కి పైగానే కేసులు నమోదు అయ్యాయంటే యువత ఏ విధంగా తయారవుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంలో పోలీసులు పదే పదే యువతను హెచ్చరిస్తున్నారు. లైక్స్ కోసం ఆశపడి జీవితాలను పాడు చేసుకోవద్దని పదే పదే చెబుతున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×