E-Paper
Advertisement

CP Sajjanar: బైక్ నడుపుతూ యూట్యూబ్ చూస్తే.. సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్

CP Sajjanar: బైక్ నడుపుతూ యూట్యూబ్ చూస్తే.. సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్
Advertisement

CP Sajjanar: ఒకరి నిర్లక్ష్యం మరొకరు ప్రాణాలు తీస్తు్న్న ఘటనలు నిత్యం రోడ్లపై కనిపిస్తుంది. రోడ్లపై నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని మరోసారి హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. బైక్ డ్రైవింగ్ చేస్తూ ఫోన్ చూడడం ప్రమాదకరమని హెచ్చరించారు. డ్రైవింగ్ చేస్తూ స్ట్రీమింగ్ చూస్తే మృత్యువుకు వెల్కమ్ చెప్పడమే అన్నారు. క్షేమంగా గమ్యస్థానానికి చేర్చాల్సిన చేతులే ఇలా వినోదం మోజులో పడితే ప్రజల భద్రతకు గ్యారంటీ ఎవరని సజ్జనార్ ప్రశ్నించారు.

మీ వినోదం.. వారికి శాపం

​క్షణకాలం అజాగ్రత్త.. కుటుంబంలో తీరని విషాదాన్ని మిగుల్చుతుందన్నారు. డ్రైవింగ్ చేస్తూ యూట్యూబ్ వీడియోలు చూడటం కేవలం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదు, ఇతరుల ప్రాణాలను పణంగా పెట్టే నేరం అన్నారు. ఇలాంటి నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైడర్ల ప్రప్రవర్తనపై నిఘా ఉంచాల్సిన బాధ్యత పైలన్ రైడర్లదే అన్నారు.
ఇలాంటి ప్రమాదకర ప్రయాణాన్ని గమనించినప్పుడు వెంటనే ఫిర్యాదు చేయాలని సజ్జనార్ సూచించారు. మీ వినోదం అమాయకుల పాలిట శాపం కాకూడదని పేర్కొన్నారు.

Advertisement

ఫోన్ చూస్తూ డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు

డ్రైవింగ్‌ చేస్తున్న సమయంలో మొబైల్‌ ఫోన్‌లో వీడియోలు చూడడం, ఇయర్‌ ఫోన్స్‌ వినియోగించడం వంటి పనులు ప్రమాదకరమైనవని సజ్జనార్ తెలిపారు. అలా చేసే వారిపై ట్రాఫిక్‌ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని హైదరాబాద్‌ సిటీ సీపీ వీసీ సజ్జనార్‌ హెచ్చరించారు. వాహనాలు నడిపే సమయంలో మొబైల్‌ ఫోన్స్‌ చూడడం ఎంతో ప్రమాదకరమన్నారు. అంతేకాకుండా శిక్షార్హమైన నేరం అన్నారు. ఆటోలు, క్యాబ్‌లు, టాక్సీలను నడుపుతున్న డ్రైవర్లు ఇటీవల ఎక్కువగా మొబైల్స్‌ చూస్తూ డ్రైవింగ్‌ చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. డ్రైవర్ల వారి దృష్టి రోడ్డుపై ఉండకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. డ్రైవింగ్‌ సమయంలో మొబైల్‌ ఫోన్ వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్డుపై ప్రయాణించే ఇతరుల భద్రత ముఖ్యమైనని డ్రైవర్లు గమనించాలన్నారు.

Advertisement

Also Read: CM Revanth: మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×