E-Paper
Advertisement

The Goat Movie: హీరో సుధీర్‌పై కేసు పెట్టాం.. గోట్ నిర్మాత షాకింగ్ కామెంట్స్

The Goat Movie: హీరో సుధీర్‌పై కేసు పెట్టాం.. గోట్ నిర్మాత షాకింగ్ కామెంట్స్
Advertisement

The Goat Movie: జబర్దస్త్ షో తో విపరీతమైన గుర్తింపు సాధించుకున్నాడు సుడిగాలి సుదీర్. తర్వాత ఆ షో విడిచి పెట్టాడు. చాలా రియాలిటీ షోస్ లో హోస్ట్ గా వ్యవహరించాడు. మొత్తానికి చాలామంది కమెడియన్లు హీరోగా మారుతున్న సంగతి తెలిసిందే. అదే ప్రాసెస్ లో సుడిగాలి సుదీర్ కూడా హీరోగా మారాడు. అయితే తను చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ప్రస్తుతం గోట్ అనే సినిమా చేస్తున్నాడు సుదీర్. సినిమాకు సంబంధించిన టీజర్ కొద్దిసేపటికి విడుదలైంది

అయితే ఈ టీజర్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. మొత్తానికి సుదీర్ నుంచి ఏ కామెడీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ కూడా ఈ సినిమాలో ఉండబోతున్నాయి అని టీజర్ చూస్తే అర్థమవుతుంది. అయితే ఈ సినిమా దర్శకుడు కి నిర్మాతకి మధ్య ఎప్పటినుంచో విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో సినిమా నుంచి దర్శకుడుని తొలగించారు. ఆ తర్వాత హీరోయిన్ దివ్యభారతి తో కూడా దర్శకుడు నరేష్ కుప్పిలి సోషల్ మీడియా వేదికగా చాలా గొడవలు పడ్డారు. ఆ గొడవలు ఇప్పుడు మరింత పెద్దగా జరిగేలా అనిపిస్తున్నాయి. దీనికి కారణం సుదీర్ సినిమా ప్రమోషన్స్ కి రాకపోవడమే.

హీరో సుధీర్ పై కేసు 

Advertisement

ఈ సినిమాను మొగుళ్ళ చంద్రశేఖర్ నిర్మించారు. దాదాపు 3 నుంచి 5 కోట్లలో సినిమా అయిపోతుంది అనుకుని మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు భారీ బడ్జెట్ కి వెళ్ళిపోయింది. ఇలా బడ్జెట్ దాటిపోవడం వలన దర్శకుడు నరేష్ ను ఈ సినిమా నుంచి తొలగించారు.

పాగల్ సినిమా తర్వాత దర్శకుడు నరేష్ చేసిన సినిమా ఇది. స్వతహాగా నరేష్ కి మరియు సుడిగాలి సుదీర్ కి మంచి ఫ్రెండ్షిప్ ఉండడంతో ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కి సుధీర్ వెళ్లకూడదు అని నరేష్ చెప్పారట. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగానే సుధీర్ ఈ సినిమా ప్రమోషన్స్ కు రాలేదు అని తెలుస్తుంది.

Advertisement

అయితే మరోవైపు నిర్మాత చంద్రశేఖర్ మాట్లాడుతూ, నరేష్ గురించి కొన్ని విషయాలను చెప్పారు. అలానే హీరోయిన్ తో జరిగిన గొడవ విషయాన్ని కూడా ప్రస్తావించారు. సినిమాలోని కొన్ని సీన్స్ తను లీక్ చేశాడు అంటూ తన బాధ చెప్పుకున్నారు. అలానే ఫిలిం ఛాంబర్ లో కేసు కూడా నడుస్తుంది అని క్లారిటీ ఇచ్చారు.. మరోవైపు సుధీర్ ఫ్యామిలీ చాలా మంచిదని. తన పైన కూడా పోలీస్ కేసు పెట్టామని త్వరలో తను కూడా సినిమా ప్రమోషన్స్ కి వస్తారని తెలిపారు నిర్మాత చంద్రశేఖర్.

దర్శకుడు పేరు లేకుండానే టీజర్ 

అయితే దర్శకుడిని తొలగించడం అనేది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొత్త విషయం ఏమీ కాదు గతంలో కూడా చాలా సినిమాలకి ఇది జరిగింది. డెవిల్ సినిమాకి కూడా ఇదే జరిగింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా దర్శకుల కార్డు వచ్చినప్పుడు ఇద్దరు పేర్లు పడతాయి అని చాలామంది ఊహించారు.

కానీ ఎక్కడ క్రెడిట్ లో దర్శకుడు పేరు లేదు. ఇలా దర్శకుడు పేరు లేకుండా సినిమా టీజర్ రావడం అనేది అతి తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. అందులో ఇదొకటి. నిర్మాతగా మాత్రమే చంద్రశేఖర్ తన పేరు వేసుకున్నారు. డైరెక్టర్ ఎవరు అనేది వేయలేదు.

Also Read: Samantha marriage : లింగ భైరవి పవిత్ర క్షేత్రంలో సమంత రుత్ ప్రభు భూతశుద్ధి వివాహం, ఏమిటా ప్రత్యేకత?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×