E-Paper
Advertisement

Substations: వావ్ క్రేజీ ఐడియా.. తొలి దశ సక్సెస్ అయితే సిటీ మొత్తం ఇదే ట్రెండ్..?

Substations: వావ్ క్రేజీ ఐడియా.. తొలి దశ సక్సెస్ అయితే సిటీ మొత్తం ఇదే ట్రెండ్..?
Advertisement

Substations: స్వేచ్చ బ్యూరో: హైదరాబాద్ నగరంలో కొత్త విద్యుత్ సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు స్థలాభావం తీవ్ర సమస్యగా మారిన నేపథ్యంలో ఎస్పీడీసీఎల్ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఫ్లైఓవర్ల కింద ఉన్న ఖాళీ ప్రదేశాలను వినియోగిస్తూ కాంపాక్ట్ (మోడ్రన్) సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ అధికారులతో ఇప్పటికే చర్చలు పూర్తి చేసినట్లు సమాచారం. నగరంలో మొత్తం 10 ప్రాంతాలను గుర్తించిన అధికారులు, తొలి దశలో మూడు చోట్ల సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించారు. త్వరలోనే టెండర్లు పిలిచే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎక్కువ స్థలం అవసరం లేకుండా అత్యాధునిక సాంకేతికతతో నిర్మించే కాంపాక్ట్ సబ్‌స్టేషన్ల ద్వారా విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఎస్పీడీసీఎల్ భావిస్తోంది. భూసేకరణ అవసరం లేకుండా ఫ్లైఓవర్ల కింద ఖాళీగా ఉన్న స్థలాన్ని వినియోగించడం వల్ల సమయం, వ్యయం రెండూ తగ్గనున్నాయి.

గచ్చిబౌలి సమీపంలో..

మొదటి దశలో కొండాపూర్ ఆర్టీవో కార్యాలయ పరిధిలోని విద్యుత్ అవసరాల కోసం కొత్తగూడ ఫ్లైఓవర్ 59-61 పిల్లర్ల మధ్య ఒక సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే 8వ బెటాలియన్, కొండాపూర్ ప్రాంతానికి విద్యుత్ సరఫరాను మెరుగుపరిచేందుకు కొత్తగూడ ఫ్లైఓవర్ పిల్లర్ నంబర్ 2-3 మధ్య మరో సబ్‌స్టేషన్ నిర్మించనున్నారు. నల్లగండ్ల ప్రాంతానికి సంబంధించిన సబ్‌స్టేషన్‌ను గచ్చిబౌలి సమీపంలో ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మూడు సబ్‌స్టేషన్ల నిర్మాణానికి త్వరలోనే టెండర్లు ఆహ్వానించే అవకాశం ఉంది. తొలి దశ విజయవంతమైతే, గుర్తించిన మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇదే తరహా కాంపాక్ట్ సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేయాలని ఎస్పీడీసీఎల్ యోచిస్తోంది. నగరంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుందని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

Also Read: Water Tourism: ఇక గోవా వెళ్లక్కర్లేదు.. తెలంగాణలో నీటిపై తేలియాడే రెస్టారెంట్.. ఎక్కడో తెలుసా..!

కాంపాక్ట్ సబ్‌స్టేషన్లు..

సాధారణ సబ్‌స్టేషన్లతో పోలిస్తే కాంపాక్ట్ సబ్‌స్టేషన్లు తక్కువ స్థలంలో ఏర్పాటు చేయవచ్చు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించే కాంపాక్ట్ సబ్‌స్టేషన్లు వర్షపు నీరు, దుమ్ము తదితరాల ప్రభావం చాలా వరకు ఉండదని అధికారులు చెబుతున్నారు. ఫ్లైఓవర్ కింద ఏర్పాటు చేయడం వల్ల వర్షంలో నేరుగా తడిసే అవకాశం ఉండదని, దీంతో విద్యుత్ పరికరాల భద్రత మరింత మెరుగుపడుతుందని పేర్కొంటున్నారు. అలాగే షార్ట్‌సర్క్యూట్లు, విద్యుత్ ప్రమాదాలు వంటి ఘటనలు తగ్గడంతో పాటు నిర్వహణ కూడా సులభతరం అవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. నగరంలో ఖాళీ స్థలాలు దొరకని పరిస్థితుల్లో ఫ్లైఓవర్ల కింద ఉన్న స్థలాలను వినియోగించడం ద్వారా భూసేకరణ సమస్యను అధిగమించడంతో పాటు విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేయవచ్చని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే, గుర్తించిన మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే తరహా కాంపాక్ట్ సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేయాలని ఎస్పీడీసీఎల్ యోచిస్తోంది.

Advertisement

Also read: Farmer DISCOM: రైతు డిస్కంకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బావుల వద్ద కరెంట్ మీటర్లపై కీలక ప్రకటన!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×