// // Congress Victory Huzurabad: కౌశిక్ రెడ్డికి షాక్.. హుజూరాబాద్‌లో 'హస్తం' హవా.. 16 వార్డుల్లో విక్టరీ.. -->
E-Paper
Advertisement

Congress Victory Huzurabad: కౌశిక్ రెడ్డికి షాక్.. హుజూరాబాద్‌లో ‘హస్తం’ హవా.. 16 వార్డుల్లో విక్టరీ..

Congress Victory Huzurabad: కౌశిక్ రెడ్డికి షాక్..  హుజూరాబాద్‌లో ‘హస్తం’ హవా.. 16 వార్డుల్లో విక్టరీ..
Advertisement

Congress Victory Huzurabad: హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీకి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి గట్టి రాజకీయ షాక్‌నిచ్చాయి. మొత్తం 30 వార్డులున్న హుజూరాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ 16 స్థానాలను కైవసం చేసుకుని స్పష్టమైన మెజారిటీతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. ఇతర పార్టీల మద్దతు అవసరం లేకుండానే కాంగ్రెస్ తన సొంత బలంతో చైర్మన్ పీఠాన్ని అధిష్టించబోతుండటం గమనార్హం. మరోవైపు, గతంలో బలంగా ఉన్న బీఆర్ఎస్ కేవలం 8 స్థానాలకే పరిమితం కాగా, భారతీయ జనతా పార్టీ 5 వార్డుల్లో విజయం సాధించింది. ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.

సొంత నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవడంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విఫలమయ్యారని విశ్లేషకులు భావిస్తున్నారు. అసెంబ్లీలో గానీ, జిల్లా పరిషత్ సమావేశాల్లో గానీ లేదా హైదరాబాద్‌లోని ఇతర రాజకీయ వేదికలపై నిరంతరం వార్తల్లో నిలుస్తూ, వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన కౌశిక్ రెడ్డి, తన సొంత గడ్డపై పార్టీని కాపాడుకోలేకపోయారు. రాష్ట్రవ్యాప్తంగా హడావుడి చేసే కౌశిక్ రెడ్డికి, హుజూరాబాద్ ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం ద్వారా సరైన సమాధానం చెప్పారని రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Advertisement

హుజూరాబాద్ మున్సిపాలిటీలో గెలిచిన అభ్యర్థుల వివరాలను పరిశీలిస్తే, కాంగ్రెస్ నుండి మేకల స్వరూప, సునీత, గూడూరు అంజలి, ఇల్లందు సమ్మయ్య, జున్నోత్ భాస్కర్, పుణ్య, వెంకటేశ్వరురాలు, బానోత్తి వెంకట్, వెన్నెల, మహమ్మద్ ఖాలిద్, శ్రీలేఖ, రాంపల్లి శ్రీనివాస్, కోయాల్కర్ భారతీ, తాలపల్లి రమేష్, మోగిలి, సుహాసిని విజయం సాధించారు. బీఆర్ఎస్ నుండి సమీరా గఫర్, నంది శ్రీనివాస్, ప్రతాప తార, సింధూజ, బండ నరేష్, రవీందర్ రావు, ప్రతాప మంజుల, కేసి రెడ్డి లావణ్య గెలుపొందారు. బీజేపీ నుండి సుమలత, అనూష, మనోజ్, లక్ష్మీ దుర్గ, కొండా ప్రశాంతి విజయం సాధించగా, రాజ్‌కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు.

ఈ విజయం హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవాన్ని చాటుతుండగా, కౌశిక్ రెడ్డి వ్యవహారశైలిపై నియోజకవర్గ ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఈ ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. స్థానిక అభివృద్ధి, ప్రజా సమస్యలను పక్కన పెట్టి కేవలం వివాదాలకే ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే బీఆర్ఎస్ ఇక్కడ ఓటమిని చవిచూసిందని విమర్శలు వస్తున్నాయి.

Advertisement

Read Also:  జనగామ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సెంటర్ వద్ద హైటెన్షన్‌.. ఇండిపెండెంట్లను లాక్కెళ్లి..

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×