E-Paper
Advertisement

పెళ్లి ముందు వరుడు జంప్.. అదనపు కట్నం కోసం పెళ్లికొడుకు పరారీ!

పెళ్లి ముందు వరుడు జంప్.. అదనపు కట్నం కోసం పెళ్లికొడుకు పరారీ!
Advertisement

Dowry Demand: స్వేచ్ఛ బ్యూరో: అదనపు కట్నం కోసం పెళ్లికొడుకు పరారైన ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో కలకలం రేపింది. పెళ్లికి రెండు రోజుల ముందు వరుడు కనిపించకుండా పోవడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు అబ్బాయి ఇంటి ముందు పురుగుల మందు డబ్బాతో బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వివరాల్లోకి వెళ్తే..

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండపల్లి గ్రామానికి చెందిన పొన్నాల రాజయ్య కుమార్తెకు కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి చెందిన వీరబోయిన రాజయ్య చిన్న కుమారుడు కిరణ్‌తో వివాహం నిశ్చయమైంది. ఇరు కుటుంబాల అంగీకారంతో మార్చి 6న వివాహం జరగాల్సి ఉండగా, ముందుగా వరకట్నంగా రూ.26 లక్షలకు ఒప్పందం కుదిరినట్లు అమ్మాయి తండ్రి పొన్నాల రాజయ్య తెలిపారు. ఎంగేజ్‌మెంట్ సమయంలో రూ.10 లక్షలు నగదుగా ఇచ్చినట్లు చెప్పారు. పెళ్లి సమయం దగ్గరపడుతున్న వేళ వరుడు కుటుంబ సభ్యులు అదనంగా రూ.9 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆరోపించారు.

Advertisement

Also read: గద్వాల్లో ఫుట్ పాత్‌లు మాయం.. నిత్యం నరకం చూస్తున్న వాహనాదారులు

అదనపు కట్నం కోసం..

అంత మొత్తాన్ని ఇవ్వడం సాధ్యం కాదని అమ్మాయి కుటుంబ సభ్యులు తెలిపిన నేపథ్యంలో, పెళ్లికి రెండు రోజుల ముందు వరుడు కిరణ్ కనిపించకుండా పోయినట్లు తెలిపారు. దీంతో వెంటనే పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పొన్నాల రాజయ్య వెల్లడించారు. అదేవిధంగా, వరుడు తల్లిదండ్రులే తమ కుమారుడిని దాచిపెట్టి అదనపు కట్నం కోసం పెళ్లిని నిలిపివేశారని అమ్మాయి కుటుంబ సభ్యులు ఆరోపించారు. పెళ్లి ఆగిపోవడంతో తమ కుటుంబ పరువు దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అబ్బాయి ఇంటి ముందు పురుగుల మందు డబ్బాతో బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇరు కుటుంబాలతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Also Read: తెలంగాణ బీజేపీ ఎంపీల పై కల్వకుంట్ల కవిత ఫైర్!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×