E-Paper
Advertisement

Hyderabad latest news: బాలికపై గ్యాంగ్‌రేప్.. గవర్నర్ సీరియస్.. ముగ్గురి అరెస్ట్..

Hyderabad latest news: బాలికపై గ్యాంగ్‌రేప్.. గవర్నర్ సీరియస్.. ముగ్గురి అరెస్ట్..
Advertisement
gang rape

Hyderabad: పేరుకేమో నందనవనం కాలనీ. అక్కడో అడ్డా ఏర్పాటు చేసుకుంది గంజాయి బ్యాచ్. మైనర్ బాలికపై అయూబ్ అనే కీచక రౌడీషీటర్ కొన్నాళ్లుగా కన్నేశాడు. ఇంటిపై దాడి చేసి.. మరో ఇద్దరితో కలిసి అత్యాచారానికి తెగబడ్డాడు. ఆ దుర్మార్గులకు మరో నలుగురు సహాయపడ్డారు. హైదరాబాద్ శివార్లలో జరిగిన ఈ గ్యాంగ్‌రేప్ తీవ్ర కలకలం రేపుతోంది.

ఈ కేసులో పురోగతి సాధించారు రాచకొండ పోలీసులు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వాళ్లకు సహకరించిన మరో నలుగురి కోసం గాలిస్తున్నారు.

Advertisement

మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నందనవనం కాలనీలో 16 ఏళ్ల బాలికపై గంజాయి బ్యాచ్ గ్యాంగ్‌రేప్ చేసిన ఘటనపై గవర్నర్‌ తమిళిసై స్పందించారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్‌, డీజీపీ, రాచకొండ సీపీని ఆదేశించారు. తక్షణమే బాధితురాలి ఇంటికెళ్లి ఆ కుటుంబానికి అవసరమైన సహాయం చేయాలని రెడ్‌క్రాస్‌ సొసైటీ ప్రతినిధులను ఆదేశించారు గవర్నర్ తమిళిసై.

అసలేం జరిగిందంటే..
హైదరాబాద్, మీర్‌పేటలో తమ్ముడితో కలిసి బంధువుల ఇంట్లో ఉంటోంది 16 ఏళ్ల మైనర్ బాలిక. ఓ బట్టల షాపులో పని చేస్తోంది. సోమవారం ఉదయం తమ్ముడితో పాటు ఇంట్లో ఉన్న సమయంలో.. ఎనిమిది మంది దుండగులు ఒక్కసారిగా చొరబడ్డారు. వారంతా గంజాయి మత్తులో ఉన్నారు. అందులోని ముగ్గురు.. ఆ బాలిక మెడపై కత్తి పెట్టి.. భవనంపైకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. మిగిలిన వారు ఆమె తమ్ముడిని బంధించి కాపలాగా ఉన్నారు. ఈ విషయం వెలుగుచూడటం తీవ్ర కలకలం రేపింది. రౌడీషీటర్ అయూబ్.. స్థానికంగా గంజాయి దందా చేస్తున్నాడని.. అతని గ్యాంగే ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ముగ్గురిని అరెస్ట్ చేయగా.. మిగతా వాళ్లు పరారీలో ఉన్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×