E-Paper
Advertisement

Nizamabad Collector: ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రం అందజేసిన కలెక్టర్ త్రిపాఠి

Nizamabad Collector: ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రం అందజేసిన కలెక్టర్  త్రిపాఠి
Advertisement

Nizamabad Collector:  ఎక్సైజ్ కానిస్టేబుల్ కుమారి గాజుల సౌమ్య సోదరుడు గాజుల శ్రవణ్ కు ప్రభుత్వం ఉద్యోగ అవకాశం కల్పించగా, ఈ మేరకు కలెక్టర్ ఇలా త్రిపాఠి  తన చాంబర్ లో ఉద్యోగ నియామక పత్రం అందజేశారు. విధి నిర్వహణలో భాగంగా ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య గత నెల 23వ తేదీన తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో గంజాయి స్మగ్లర్లు కారుతో ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడి తొమ్మిది రోజులు మృత్యువుతో పోరాడి జనవరి 31న చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం విదితమే. సౌమ్య అంత్యక్రియలను ప్రభుత్వం అధికార లాంచనాలతో జరిపించడమే కాకుండా, ఇటీవలే నిజామాబాద్ పర్యటనకు హాజరైన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన చేతుల మీదుగా సౌమ్య కుటుంబ సభ్యులకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియాను అందించారు. బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు.

Also Read: Allu Sirish Wedding: అల్లు వారింట పెళ్లి సందడి.. పవన్ కళ్యాణ్‌కు వెడ్డింగ్ కార్డ్ అందించిన అల్లు అరవింద్..

కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా

Advertisement

ఈ మేరకు సౌమ్య సోదరుడు గాజుల శ్రవణ్ కు ఎక్సైజ్ శాఖ లో జూనియర్ అసిస్టెంట్ గా ప్రభుత్వం ఉద్యోగం కల్పించగా, కలెక్టర్ ఇలా త్రిపాఠి నియామక పత్రం అదించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సంఘటన జరిగిన నెల రోజుల లోపే సౌమ్య కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా, సౌమ్య సోదరుడు శ్రవణ్ కు ప్రభుత్వ ఉద్యోగం కల్పించిందని అన్నారు. బాధిత కుటుంబానికి ఇకముందు కూడా ప్రభుత్వ యంత్రాంగం తోడ్పాటుగా నిలుస్తుందని కలెక్టర్ భరోసా కల్పించారు. సౌమ్య మరణానికి కారకులైన వారిని కఠినముగా శిక్ష పడేలా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమం లోఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, సీ.ఐ స్వప్న, ఎస్.ఐ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: Mohammad Amir: నీ కంటే ఉగాండా ప్లేయ‌ర్లు న‌యం..కండ్లు మూసుకుని ఆడే ద‌ద్ద‌మ్మ‌, అభిషేక్ ప‌రువు తీసిన అమీర్‌

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×