E-Paper
Advertisement

Anjali: ఫిలింఫేర్ అవార్డ్స్ వల్ల హీరోయిన్ అంజలికి అసహనం.. ఏమైందంటే!

Anjali: ఫిలింఫేర్ అవార్డ్స్ వల్ల హీరోయిన్ అంజలికి అసహనం.. ఏమైందంటే!
Advertisement

Actress Anjali: స్టార్ హీరోయిన్ అంజలి ఈమధ్య ఫిలిం ఫేర్ కార్యక్రమానికి హాజరవ్వడానికి వెళ్తూ.. ఒక అనుకోని సమస్యను ఎదుర్కొన్నారు. అవార్డ్స్ కోసం ఆమె విమానాశ్రయానికి సమయానికి చేరుకున్నప్పటికీ.. అక్కడ ముందుగా ఏర్పాటు చేసిన పికప్ కారు దాదాపు అరగంట పాటు రాలేదని సమాచారం. ఈ కారణంగా ఆమె విమానాశ్రయంలోనే చాలాసేపు వేచి ఉండాల్సి వచ్చింది. ఈ సంఘటనపై సోషల్ మీడియాలో కూడా చర్చ జరిగింది. ఇలాంటి పెద్ద ఈవెంట్లకు వెళ్లే సమయంలో సెలబ్రిటీలకు ఇబ్బందులు ఎదురవడం ఇదే తొలిసారి కాదు.

హీరోయిన్ అసహనం..!

అయితే అంజలీని మరి అంతసేపు ఎదురు చూసేలా చెయ్యడం ఏంటి అని.. ఇది అంజలికి అవమానంతో సమానం అంత కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్ పెడుతున్నారు. అంతేకాదు ఈ వీడియోలో అంజలి చాలా అసహనంగా కూడా కనిపించింది.

Advertisement

అంజలి సినీ కెరీర్ విషయానికి వస్తే, ఆమె తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సహజ నటన, సింపుల్ లుక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే నటిగా ఆమెకు పేరు ఉంది. “జర్నీ”, “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు”, “బలుపు” వంటి సినిమాల్లో ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ముఖ్యంగా బలమైన పాత్రలను ఎంచుకుంటూ, కథకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేయడం అంజలి ప్రత్యేకతగా మారింది.

Advertisement

తెలుగులోనే కాకుండా తమిళ పరిశ్రమలో కూడా అంజలి మంచి అవకాశాలు అందుకుంది. కథానాయికగా మాత్రమే కాకుండా, పాత్రకు అవసరమైతే ప్రయోగాలు చేయడానికి ఆమె ఎప్పుడూ వెనుకాడలేదు. అందుకే ఆమెకు ఒక స్థిరమైన అభిమాన వర్గం ఉంది.

అంజలి ఈమధ్య గేమ్ చేంజెర్ సినిమాలో కనిపించింది. ఈ చిత్రంలో హీరోగా Ram Charan నటించారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల ఆశలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. సినిమా ఫలితం ఎలా ఉన్నా, అంజలి తన పాత్రకు న్యాయం చేశారనే అభిప్రాయం కొంతమంది ప్రేక్షకుల్లో ఉంది.

సినిమా విజయాలు, అపజయాలు ఎలా ఉన్నా అంజలి తన ప్రయాణాన్ని ఆత్మవిశ్వాసంతో కొనసాగిస్తోంది. ముందు ముందు.. కూడా మంచి కథలు, బలమైన పాత్రలతో అంజలి ప్రేక్షకుల ముందుకు రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.

ALSO READ: Sreemukhi : శ్రీముఖి ఏముంది మావా.. లంగావోణీలో మనసు దోచుకుంటుంది..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×